పుట:JanapadaGayyaalu.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నొటేషన్" వ్రాస్తూ వచ్చింది. ఈ కృషి శ్లాఘనీయం. జానపద సంగీతం స్వరబద్ధంగా ముద్రించి, ముందుతరాల వారికి లభింప చేయడం కన్న ముఖ్యమైన సేవ మరేముంది.

శ్రీమతి అనసూయ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు "కళాప్రపూర్ణ" అనే గౌరవ డాక్టరేట్ పట్టం ఇవ్వడం ఎంతయూ సముచితం. ప్రశంసార్హం.

ఈ గ్రంథ ముద్రణలో మాకు తోడ్పడిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీ మంచాళ జగన్నాథరావు గారికి, చక్కగా ముద్రించిన నాట్యకళ ప్రెస్ నిర్వాహకులకు మేము కృతజ్ఞఉలము.


ఇట్లు

డా|| మం. బాలమురళీకృష్ణ

అద్యక్షులు

ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమి