పుట:Jagattu-Jiivamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

శ్రీయుత వసంతరావు వేంకటరావుగారు ఎం. ఎస్సీ. పరీక్షలో నుత్తీర్ణులై శ్రీ విజయనగర మహారాజావారి ఆంగ్లకలాశాలయందు ప్రకృతి శాస్త్రోపన్యాసకులుగ నియమింపబడి చిరకాలమునుండియు నీ శాస్త్రమున పరిశోధన గావించుచు లోకమున కుపకారార్ధమై ప్రాచీనాధునిక విజ్ఞాన సమన్వయపూర్వకముగ గ్రంథ రచనము చేయుచున్నారు. ప్రస్తుతము దీని కుపోద్ఘాతము వ్రాయవలసినదిగా నన్ను కోరిరి. నేను ప్రకృతిశాస్త్రము నభ్యసించిన వాడనుకాను. అయినను వారితో నాకుగల స్నేహమును వేదాంతశాస్త్రమందలి యాదరణమును ఈ గ్రంథమునుగూర్చి వ్రాయుటకు ప్రోత్సహించినవి.

ఈ పుస్తకము స్థాలీపులాకన్యాయముగ చూడడమైనది. దీనిలో జగత్తు, జీవము, జీవితాంతము, కాలాకాశవై చిత్రి అను పేర్లతో నాలుగు విదములుగ విభజింపబడియున్నది. ఈ గ్రంధ పఠనమువలన ఆంగ్లభాషయందలి ప్రకృతి ఖగోళశాస్త్ర పరిశోధన యొక్కయు, సంస్కృతభాషయందలి వేదాంత ఖగోళశాస్త్రముల యొక్కయు పరిజ్ఞానము అల్పాయాసముచే సిద్దించును.

ఈ పుస్తకమందున్న విషయము మాత్రము చూడగ మన వేదములలోని విషయములనే గ్రహించి ఆధునికులు తగు పరికరములతో చేసిన పరిశోధనా ఫలితమాత్రమని తెలియకమానదు. కాబట్టి స్మృతి పురాణేతిహాసాదులవలె దీనికిని వేదమూలకత సిద్ధించు