పుట:Jagattu-Jiivamu.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
41
జీవితాంతము

కనిపిస్తున్నది. ఆ గాంభీర్యం తరచినకొద్దీ మన అజ్ఞానం స్పష్టమౌతున్నది. ఈ రెండు జగత్తులును అభేద్యములే !

ఈ అభేద్యతలో మన మేమౌతాము ? పరిమితకళేబరాన్ని త్యజించినంత మనల నేజగత్తు కబళింపనున్నది ? బుద్ధిగోచరమైన ఆనంత్యంలో మిళితమైపోతామా ? లేక నిరంత పరివర్తనమునకు లోనై యున్న అసంఖ్యాక క్షణభంగుర భువనగోళాలలో చిక్కుపడతామా ? నిరంతరం జరామరణ మొందు ఈలోకాలను విడిచి ఆద్యంతరహితమై, జరామరణమెరుగని నిశ్చలసమాధి పొంద గలమా ? దుఃఖాకరమైన భవచక్రం విడిచిపెట్టి నిరామయము, ప్రశాంతము, అనంతము అగు చై తన్యం పొందగలమా ? ఇంద్రియ బుద్ధులలో ఏది సూచించిన అవస్థ మనకు ప్రాప్తించ నున్నది ? అనంత విశ్వాన్ని శోధించు సందర్భమున బుద్ధి, ఇంద్రియములు కూడ కేవల మనుపయుక్తములైన ఉపకరణములా ? తాత్కాలిక క్షుద్రోపకరములా ?

బుద్ధిగోచర జగత్తునకు, ఇంద్రియగోచార జగత్తునకు గల వ్యత్యాసము అతి స్వల్పమని రవంతవికసించిన మన బుద్ధినే విశదమౌతుంది. అనంతకాలంనుండి మనుచున్న జగత్తులో ప్రతిప్రయోగము చేయబడినదంటే, గణనాతీతమైన గతసంవత్సరములలో సంఘటింపని విషయాలు గణనాతీతమైన భవిష్యద్వ త్సరములలో సైతము వాటిల్ల నేరవంటే, కాలానంత్యానికి లేని ప్రాబల్యం మన ఊహ ఆరోపించినది. ఆనంత్యంలో నున్నవన్నియు కాలంవలె అనంతమైనవే : జగత్తులో సంభవించు సంయోగములు సంఘట్టనలుకూడ అనంతమైనవే : అనుక్షణం జగత్తు చై తన్యం సంగ్రహించుచుండవచ్చును. జగదాశయము జగన్మహత్వములో మరుగుపడింది. రాత్రి దృగ్గోచర