పుట:Jagattu-Jiivamu.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
40
జగత్తు - జీవము

గోచరమౌచున్నది. బుద్ధితః, కాలాకాశ పరిమితిలేని జగత్తులో నిమగ్నమైయున్నాము. ఈజగత్తునకు అద్యంతములు లేవు. దీని కొక లక్ష్యమున్నట్లు లేదు ; ఉండినట్లయితే గతించిన అనంతకాలంలో సాధించి ఉండెడిది. ఒక గమ్యస్థానం లేదు ; ఉండినట్లయితే ఈపాటి చేరి ఉండెడిది. ఈ అసంఖ్యాఖ భువనాలుగాని, మానవులుగాని విశ్వక్రమాన్ని ఏవిధంగాను మార్చలేరు. జగత్తున కొకభావం లేకపోతే ముందెన్నడు భావించలేదు. భావ మున్నట్లయితే, అనాదిగా అది నిశ్చలావస్థలో నుండెడిది. భావికాలంలో చేయదలచుకొన్న ప్రయోగాలనన్నీ భూతకాలంలో చేసి ఉన్నది. గతించిన అనంతకాలంలో సంభవింపని వేవియును రానున్న అనంత కాలంలో వాటిల్లుతాయనుకొనుటకు అవకాశం కనిపించదు. చై తన్య మయమై యుండనియెడల ముందెన్నడును చై తన్యయుతం కాలేదు. ఇవి బుద్ధిగోచరమైన ఆనంత్యలక్షణములు.

కాని అట్టి ఆనంత్యంలో కోట్లకొలది భువనాలు గోచరించు చున్నవి. ఈ భువనగోళాలు కాలాకాశ పరిమితములై ఉన్నవి. జన్మించడం, మరణించడం, పునర్జన్మించడమే వాటి నైజము భువనాలు జగత్తుయొక్క అవయవములు. ఆద్యంత రహితమైన జగత్తుయొక్క అవయవములు ఆద్యంతసంయుక్తమై ఉన్నవి. ఈ జగద్బాగములనే మనమెరుగుదుము. అవి ఎంత అసంఖ్యాకంగా ఉన్న వంటే, మన స్వల్పదృష్టిలో యావజ్జగత్తుని అవి నింపుతున్నవి. గమ్యస్థానం లేని జగత్తు గమ్యస్థానంగల అవయవ భూయిష్టమై ఉన్నది. ఆశయరహిత మనుకొన్న జగత్తును పరిశీలించగా అత్యంత కుతూహలంతో ఒక విశిష్టాశయాన్ని పాలించుచున్నట్లున్నది. ఇట్లు, ఇంద్రియగోచరమైన జగత్తు బుద్ధిగోచరమైన జగత్తునకు విరుద్ధంగా