పుట:Jadakucchulu1925.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత

87

 
పచ్చిముత్యాల వాయనాల్‌ ♦ పంచిపెట్టు
ఉదయసతి కాకుఁబచ్చప ♦ య్యెదలుసాచి


పత్త్ర వస్త్రాపహరణపా ♦ పంబుకతనఁ
జిన్నవోయిన కొమ్మల ♦ సిగలమీఁద
ఋతుహితస్నాన శోభన ♦ మెదుగ నరసి


తడిసితడియని నాజూకు ♦ త్రాళ్ళవలల
భావశుకములు బందాలు ♦ పడ రచించి
ప్రాణిలోకమ్ము నానంద ♦ పథవిలీన
మహ దనంతసౌందర సా ♦ మ్రూజ్యమునకుఁ
బెనువలపుఁగొన నారాట ♦ పెట్టుచుంటి,
చిక్కిన శకుంతములకు స ♦ చిత్రమయిన
అమలవాగర్థ కేళీర ♦ హాస్యమధువు
నామెతలు పెట్టి సాకితి ♦ ప్రేమవిరియ


నాదుసౌందర్య విభవము, ♦ నాదురేఖ,
నాదుకన్నె సింగారంబు ♦ నాదుచేష్ట,
నాదువడకల పోడిమి, ♦ నాదుగీతి
సుమధురంబైన పూజాప్ర ♦ సూనమట్లు
అస్ఖలితమైన కన్నె సో ♦ యగముచాయ
కనులఁబూజించి మనసుతో ♦ గారవించి