పుట:Jadakucchulu1925.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కవిత

 
తేటలయిన పుణ్యారణ్య ♦ వాటికలను
బుట్టితి నుషఃకుమారి తోఁ ♦ బుట్టుగాఁగ


అంద మెగఁబోయు లావణ్య ♦ మాహరించి
తపసివం బసియాడు జీ ♦ వనము త్రావి
పెరిగితిని నిత్యకోమల ♦ స్ఫురణలడర
ఇగురుటాకు నెలల పచ్చి ♦ యెండలందు


గ్రీష్మమాస వేణికలఁ దే ♦ ఱినజలాల
స్నానమాడి శీరోజ గు ♦ చ్ఛములు కడిగి


నింగి బాలెంతనడికట్టు ♦ కొంగులనఁగ
జాఱు నతసీపయోద ప్ర ♦ సన్న రేఖ
లందికొని లాగి చీరెగా ♦ నందగించి


క్షాళితవిశాల విశ్వరం ♦ గంబుసందు
నిండువెన్నెల తెలిచాంది ♦ నీలుగట్టి
మొలక పచ్చని మ్రుగ్గులు ♦ పుడమిఁదీర్చి
శారదోత్సన భోగమ్ము ♦ సలిపి దనిసి