పుట:JATHA.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

10





నవత నెరుగని యువత
సమత నెరుగని ప్రభుత
ఉత్త పుత్తడి పోత
ఓ రాములమ్మ!


బడుల తలుపులు మూసి
బ్రాంది మూతలు తీసి
ప్రగతనును తలమాసి
ఓ రాములమ్మ!

భావ సంఘర్షణల
నడుమ వెలుగు జ్వాల
రచన కాత్మవ్వాల
ఓ రాములమ్మ!

కార్మిక జనుల కొరకు
వదిలన్ని కడవరకు
నిలిచె కారల్ మార్క్సు
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/20&oldid=404402" నుండి వెలికితీశారు