పుట:JATHA.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

నర్సింహారెడ్డి




జనం చూపును భక్తి
కోర పాప విముక్తి
కలుగుతుందని ముక్తి
ఓ రాములమ్మ!


ప్రేమను దోమ కుట్టి
రోగము సోకినట్టి
వాడి గతియిక మట్టి
ఓ రాములమ్మ!


తన రూపొక చొప్పిక
దాదాపుగ గోపిక
పొగిడెద చెలి నలయక
ఓ రాములమ్మ!


మధురామృతము కన్న
అమరత్వమున కన్న
స్నేహాంబువే మిన్న
ఓ రాములమ్మ!


"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/21&oldid=404531" నుండి వెలికితీశారు