పుట:JATHA.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1

నర్సింహారెడ్డి




ఇచ్చినానను నొకడు
తెచ్చినానను నొకడు
అమర వీరులు ఎవరు?
ఓ రాములమ్మ!


చెలియ ఎంగిలి ఫలము
అమిత మాధుర్యమ్ము
పరులదైతే జ్వరము
ఓ రాములమ్మ!


కోప మొచ్చిన మనకు
కోప మొచ్చిన తనకు
మనకె చివాట్లు తుదకు
ఓ రాములమ్మ!


ప్రజాస్వామ్యము ఖాట
కట్టి పాడెడు పాట
ప్రజల గుండెలొ తూట
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/11&oldid=404383" నుండి వెలికితీశారు