పుట:JATHA.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జత

2




పద్య ఆధిక్యమ్ము
నడ్డి విరిచిన దమ్ము
గురజాడదే పొమ్ము
ఓ రాములమ్మ!


చెప్పిందంత వినును
చేద్దాం తప్పకనును
తలదులుపుకు తరలును
ఓ రాములమ్మ!


ఆప్ఘన్ల తలకోత
సారాఘరీ గాథ
చదలు మేసిన చరిత
ఓరాములమ్మ!


ఆలు మగల తగాద
నడుమ పోవు గాడిద
చివరకవును బూడిద
ఓ రాములమ్మ!

"https://te.wikisource.org/w/index.php?title=పుట:JATHA.pdf/12&oldid=404384" నుండి వెలికితీశారు