పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మా యొద్ద లభించు గ్రంథములు


నాయన కావ్యకంఠ శ్రీ వాసిష్ఠ గణపతిముని సంపూర్ణ జీవిత చరిత్రము - తెలుగున - 800 పేజీలు.


రచయిత : - శ్రీ గుంటూరు లక్ష్మీకాంతము

వెల 10 - 00


పత్రికాభిప్రాయములు


గణపతిముని జననం మొదలు (17 - 11 - 1878) వారు కీర్తిశేషులగు వరకూ (25 - 7 - 1936) విస్తృతమైన వారి సమగ్ర జీవితకథనమే 'నాయన' అనే గ్రంథం.


ఈ సమగ్ర కథనంలో అబ్బురపాటు కల్గించునవీ, ఔరా అనిపించునవీ, అయ్యో అనిపించునవీ, ఆనందబాష్పములను రాల్పించునవీ, ఆవేదనతో కనుల చెమఱింప జేయునవీ - అనేక సంఘటనలు కానవస్తాయి. - -(ఆంధ్ర ప్రభ)


ఒక ఆంధ్ర మహాపురుషుని జీవిత చరిత్ర తెలుగులో ఇంతవరకూ ఈ విధంగా వెలువడలేదు. - - (ఆంధ్ర పత్రిక)


అనేక విచిత్రగాధలతోకూడిన ఈ మహనీయుని జీవిత చరిత్ర నవలకంటె ఆకర్షణీయంగా చదివిస్తున్నది. ఇది యీ సంవత్సరం yవచ్చిన జీవిత చరిత్రలలో తలమానికమైనది. - - (స్వతంత్ర)


It is a big work of 783 pages, replete with thrilling episodes. Written in simple and faultless style, it is a valuable contribution to Telugu literature. - - (The Weekly Mail)