పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

261



14. లక్ష్మి నివసించుటకు రెండు గృహములవలెనుండి, యాశ్రిత భక్తజనులు చేరదగినవై, బహురమ్యమై, యడ్డులేని గమనము గలిగి, బాలసూర్యప్రకాశమానమై యొప్పు ఇంద్రాణీ పదకమల ద్వయము నా హృదయమందు బ్రకాశించుగాక.


15. శరీరముయొక్క మీది (స్థూల) భాగమందు వ్యాపించి, కుండలినీ గృహముగాగలది, జ్వలించు నగ్ని కాంతులచే మనోహరమై యున్నది, పుష్టిగలది, పవిత్రమైనది యగు నీ యింద్రాణి నా శిరఃకమల చంద్రుని ప్రకాశింపజేయుగాక.


16. ఏ పరాశక్తి గగనమందు రాజిల్లుచున్నదో, ఏది నా హృదయ మందు ప్రకాశించుచున్నదో, బహు వీర్యవంతమైన ఆ రెండు శక్తులు నా హృదయమున మిళితమై (బాహ్యాంతర భేదములేక దేవతలందువలె) నా కార్యసాధన జేయుచు నాకు సుఖము నిచ్చుగాక.

(అహంకార మమకారములను దొలగించవలెనని భావము.)


17. మనోవాక్కాయ కర్మలు మూడింటిని హరించు నింద్రాణి (అన్న మయ, మనోమయకోశములను బాలించునది యను భావముకూడ కలదు), నా మనోరధమును బోషించి నెర వేర్చు గాక, నా పాపఫలమును నశింపజేయుగాక.


18. మేఘములను చలింపజేయుటవలన ప్రసిద్ధ కీర్తినొందినది, విస్తార తేజస్సుగలది, జన్మగలవారికి జనని యగునది, యింద్రుని మోహింపజేయునట్టిదియైన మూర్తి నాకు కుశలము జేయుగాక.