పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

259



10. విషయపరిగ్రహణమందు మిగుల ఆసక్తికలది, విషయములను వీడుటలో ననిర్వాచ్యమైన పవిత్రతకలది, మిక్కిలి నిర్మలమైనది, యితరాపేక్షలు లేనిదియగు నఖిలలో కాధిపశక్తి నాయందు బ్రకాశించుగాక.


11. ప్రతి దృక్కునందెవతె నిర్దోషరూపముచే (దృశ్యమును విడచిన దృష్టిరూపము) ప్రకాశించుచున్నదో, ప్రతిదిక్కున నెవతె (బుద్ధి) రూపముగా వ్యాపించి తెలిసికొనుచున్నదో, అట్టి యనింద్య యైనది, మునివంద్యయైనది యగు నింద్రభార్య నాకు మంగళము జేయుగాక.


12. జడుల కులకుండమందు శయనించునది (అనగా తిరోధానమైనది), పండితజనులందు - నిర్మలబుద్ధితో గూడి - కులకుండాగ్ని యందు విశేషముగా బ్రకాశించునది (చిదగ్ని రూపము నుద్గార మొనర్చు బుద్ధి జ్యోతియగునది), పవిత్రచరిత్ర గలదియైన యింద్రాణి నాకు కుశలమిచ్చు గాక.

(అజ్ఞానులలో నిద్రించునదియు, విజ్ఞానులలో మేల్కొనునదియు నని భావము.)


13. దహరగుహయం దుండి సకలమును బోషించుచున్నది. ఆజ్ఞా చక్రగతమై సకలమును శిక్షించుచున్నది (అనగా శాసించునది) సహస్రారగతమై యమృత మదముగలిగించునది (అనగా నిర్విషయ నిరతిశయానందము నిచ్చునది) యైన యింద్రాణి నా యందు విలసించుగాక.

(అనగా మూడు ప్రకారములగు విలాసములను జూపుగాక).