పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 2.

ఇంద్రాణీ సప్తశతీ

231



22. ఓ జననీ ! దురవగాహమైన మార్గములో చిరకాలమునుండి పడిపోయి, గమ్యస్థానము బొందు నాసక్తి గల యీ జనుని నీవా స్థానమును స్వయముగా పొందింపుము.


23. విబుధేశ్వరియగు దయలేని శత్రువులచే సకల మర్మస్థలము లందును కొట్టబడి సంతాపము జెందియున్న మమ్ములను వివన్నాశనముకొఱకు సమర్ధులుగా జేయుచు స్వయముగా రక్షించుగాక.


24. రాక్షస సమూహమును హతముగావించిన ఆ యింద్రాణివలన భారతభూరక్షణకొఱకీ జనుడు సమర్ధుడు గావింపబడుగాక.


25. లక్ష్మి కాలయమైనట్టి, లోకములను పావన మొనర్చునట్టి పాద పద్మములుగల శచీదేవి గణపతికవియొక్క యుజ్జ్వలమైన యీ 'ద్రుతవిలంబిత' వృత్తములను వినుగాక.


__________


1. నిర్మల కిరణములను ప్రసరింపజేయుచు, నన్ని దిక్కులందును నైర్మల్య మొనర్చు తేజఃప్రసాదము నధికముగా ధరించుచున్న యింద్రాణీహసితము విస్తరించియున్న నా యాంతర్య తిమిరమును హరించుగాక.