పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 4.

ఇంద్రాణీ సప్తశతీ

171



17. కులకుండాగ్ని శిఖయొక్క కిరణములచే శిరస్సునందుండుచు, శరీరము నాత్మమయ మొనర్చు చంద్రు డనవరతము ద్రవించు చుండెను.

(ఆ కిరణములచే చంద్రుని ద్రవింపజేసి, తద్ద్రవముచే శరీరము నాత్మమయ మొనర్చునది కులకుండాగ్ని శిఖయే.)


18. ఓ దేవీ ! నా యీ శరీరమును మదింపజేయు బహుళామృత ధారలచే నీవు నాకు పవిత్రత నిచ్చుచుంటివి.

(ఆకులకుండధనము భజించు మనుజులందు విస్తరించును.)


19. ఈ శిరశ్చంద్రుని యమృతస్రావముచే శరీరము మదముబొందు చుండ, హృదయమందు బ్రకాశించు సూర్యకాంతివలన చిత్తము జ్ఞానముబొందుచున్నది.

(ఈ రెండింటికి, అనగా సూర్యచంద్రుల వ్యాపారమున కగ్ని శిఖ కారణము)


20. ఓ శచీ ! భారతదేశగతిని జూచి దుఃఖితుడనై యున్న నాకు యోగమదముచే తృప్తి గలుగదు. అమోఘమైన ఉపాయము నెఱుగుటకై నాహృదయమందు సూర్యుని ప్రకాశింపజేయుము.


21. ఓ తల్లీ ! ఆనందముగలిగించు చంద్రకళావిలాసము నాకు తెలిసినది. సూర్యుని వైభవముయొక్క పరిమితి నెఱుగుటకు నే నుత్సాహపడుచుంటిని.