పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

163



19. ఓ తల్లీ ! నీ లోచనములు కాంతికి, సర్వతోగతికి నిధులు. కవుల ధోరణి ననుసరించి వానిని పద్మములతో బోల్చుటకు నేను లజ్జించుచుంటిని.


20. విశాలములై ప్రకాశించు నేత్రములు, సంపెంగపువ్వుతో సరియగు నాసిక, రత్న ఖచితమైన అద్దములవంటి చెక్కిళ్లు, శ్రీకారమును బోలు సుందర కర్ణములు,


21. అష్టమీ చంద్రుని బోలు ఫాలము, ముల్లోకములను చలింప జేయు విలాసము, నవ్వుచే సుందరమగుచున్న ముఖముగల యింద్రాణి నాకు మంగళము లొనర్చుగాక.


22. చిఱునవ్వునందు తెలుపురంగు, తల వెంట్రుకలయందు నలుపు రంగు, అధరోష్ఠమందెరుపురంగు - యీ మూడు గుణములు గల ప్రకృతి మమ్ము రక్షించుగాక. (సత్త్వరజస్తమన్సులు)


23. సకలలోక నారీమణులలో శుభప్రదయైనది అని యే దేవిని వేదము చెప్పుచున్నదో, జగదాకాశముల రెండింటియందే దేవి కాంతిసారమో, అట్టి యింద్రాణికి నేను నమస్కరింతును.


24. శరీరమును ధరించిన యింద్రుని లోచన భాగ్యలక్ష్మియగు పద్మ నేత్రములుగల దేవి భారతరక్షణకై నరసింహ పుత్రునకు సామార్ధ్యము నిచ్చుగాక.

('సర్వభూపతి'కి బదులు 'స్వర్గ భూపతి' యని పాఠాంతరము)