పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 3.

ఇంద్రాణీ సప్తశతీ

157



2. దుష్టసమూహమున కందరానిది, శిష్టులశోకమును నివారించు సామర్ధ్యముగలది, స్వర్గమునకు రాణియునగు ఇంద్రాణి భారత దేశ కష్టములను దొలగించుగాక.


3. దేవతల కిరీటములందుండు మణుల కాంతులకు స్వయముగా మఱింత కాంతినొసగు ఇంద్రాణి పాదపద్మశోభ సదా నాకు క్షేమమిచ్చుగాక.


4. ఓ దేవీ ! నీ ముఖము బహు కాంతిమంతము. అందుల కింద్రుని మనస్సే సాక్షి. ఓ తల్లీ ! నీ చరణము లతి కాంతిమంతములు. వానిని స్మరించు మా మనస్సే యందులకు సాక్షి.


5. ఓ తల్లీ ! దేవతలచే నమస్కరింపబడును గనుక ప్రకాశవంతమైనవి, యింద్రుని నేత్రముల నాకర్షించును గనుక సుందరమైనవి, నమ్రుల పాపములను ఖండించును గనుక పావనమైనవి యగు నీ పాదములను నేను సేవించుచుంటిని.


6. ఓ తల్లీ ! కాంతుల సమూహమంతయు నే పిక్కలయందు ఘనీభవించెనో, ఇంద్రుని వేయి కన్నులు నే పిక్కలను జూచుటకు లోభించుచున్నవో, అట్టి నీ పిక్కలు ప్రకాశించుచున్నవి.


7. ఓ తల్లీ ! వినయసమయమందే నీ తొడలను వాణీదేవి కూడ వందిజనమువలె నమస్కరించుచుండెనో, అట్టి నీ తొడలు సౌందర్య సారమునకు నిలయములు.