పుట:Indrani-Saptasathi-in-Telugu-By-Vasishtha-T-Ganapati-Muni.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్త. 1.

ఇంద్రాణీ సప్తశతీ

139



7. ఓ తల్లీ ! భాస్కర, శంకర, మాధవ విఘ్నేశ్వరులు (వృషా కపి నామధేయులు) అంతర్వ్యాప్తమైన అంతరిక్ష మే శరీరముగా గలిగిన నీకు పుత్రులు కారను మాటలేదు.


8. ఓ దేవీ ! దేవతాస్వరూపుడైన దేవేంద్రుడు కపట స్త్రీరూపమును దాల్చిన నీకు వల్లభుడు. ఆ యింద్రుడును ఆకాశశరీరవగు నీకు సుతుఁడనియే చెప్పఁదగును.


9. ఆ నీవు పండితులచే 'శవసి' యనబడుచుంటివి. ఆకాశ శరీరిణివైన నీవు 'ఇంద్రసూః' (ఇంద్రునికనినది) యనియు పిలువబడు చుంటివి (ఇంద్రునకు మాత్రము వృషాకపినామము చెప్పబడ లేదు). లింగభేదమువలన, సాదృశ్యమువలన శవసి యని కీర్తింపబడితివి. 'శవ' శబ్దము శక్తివాచకము.


10. అదితి యనినను, శవసి యనినను నొక్కటే. ఎవ తెను సర్వ దేవతలకు తల్లిగా తెలియుచుండిరో, యెవతె మరుత్తులకు తల్లియై 'పృశ్ని' యని పిలువబడుచున్నదో, ఆమె యీ శవసి కంటె వేఱుకాదు.


11. శక్తియే పృశ్ని గాను, అదితిగాను, భద్రగాను, శవసిగాను చెప్పబడుచున్నది.


12. పండితులచే గొప్పదిగా నెంచబడిన శక్తి భాగము 'పృశ్ని'. 'ధేను' అను శబ్దములతో పిలువబడెను. ఆ శక్తిభాగమునే యితర పండితులు మనుజుల కిష్టమైన భాషతో 'గౌరీ' యనియు, స్త్రీ యనియు చెప్పిరి.