పుట:Hungary Viplavamu.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జోసఫుటాత్

అది 1956 అక్టోబరు 22 వ తేదీ మగళవారం. ఆరోజు ప్రపంచం అంతత్వరగా మరిచిపోలేదు. సాయంకాలం వావస్తూవుంది. పద్దెనిమిదేళ్ళ యువకుడొకడు తనఇంటిపని అట్టేపెట్టి, హంగేరీరాజధాని బుడాపేస్టు నగరంలో కోబానియావీధిలో వున్న ఇంజనులు ఫ్యాక్టరీ ఫోర్మేను కార్యాలయాని వెళ్ళాడు. సాయంకాలం షిప్టులో అతడిపని.

"కమ్యూనిస్టు పఠనకేంద్రాలికి ఇంగా తరుచుగా వెళ్ళాలి నువ్వు" హటాత్తుగా యవకుణ్ణి హెచ్చరిస్తూ అన్నాడు ఫార్మెను.

యువకుడు కావడంచేత ఫార్మేనుకి జవాబుచెప్పాలని అనుకున్నాడు జోసపు. అదలిస్తూ వున్న చూపులతో క్రూరంగా చూశాడు ఫార్మేను. దాంతొ తలవంచి వూరుకున్నాడు యువకుడు

"రోజుకి పదిగంటలు పనిచేస్తాను" ఆఫీసుబైటికి వచ్చేసి అనుకున్నాడు యువకుడు- "ఐయినా సరిపోయినంత తిండిలేదు నాకు. పనయిన తరవాత కమ్యూనిస్టు సభలికి ఎందుకు వెళ్ళాలి?"

అందమైన యువకుడతడు, నల్లటి జుత్తూ, బూడిదగంగు కళ్ళూ తిన్నగా జువ్వలావుంటాడు. ఒంటిమీద మచ్చలు యవ్వనం పాటంరింపుతో అప్పుడప్పుదే చెరిగిపోతూ వున్నాయి. చౌకబారు కాడ్రాయిపంట్లం తొడుకున్నాడతడు. దానికంటే చౌక్రకం చొక్కా వేసుకున్నాడు. ఒకబనియనులా వుందది. అతడు ప్రతీ ఆదివారం తొడుక్కుంటాడని, ఇప్పటికి నాలుగేళ్ళయి పనిచేస్తూవున్నా అతడికి వున్న బట్టలన్నీ అవే.

బాగుండునని తిండీ, రానూపోనూ ట్రాం ఖర్చులూ అప్పుడప్పుడు తన తండ్రికి ఇచ్చే కొద్దిపాటి డబ్బులూ - తనకివచ్చే కూలిడబ్బుయావత్తూ ఇంత మాత్రానికి సరిపోతుంది బొటాబొటిగా. నిజంగా అతడికి వచ్చే ఆదాయం విచారిస్తే మనకి జాలివేస్తుంది.

జోనపుటాత్ కి తల్లిలేదు. ఆమ చచ్చిపోయి రెండేళ్ళయింది. ఆమెచావు ఒకరహస్యం, పాపం, ఆమెచావు జోనపు కుటుంబానికి వొక పెద్దదెబ్బ.