పుట:Hungary Viplavamu.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆర్దికంగానూ వొక ఆపద. ఆమె ఎప్పుడూ ఉలాసంగా వుండేది. అయితే మహదాగేది. ఆమెనోటికి అడ్డూ ఆపూ వుండేది కాదు. ఎవళ్ళయినా హేళన చెయాడంలో ఆమె వెనకాడేది కాదు. ఆతల్లి చాయలే జోసపులోనూ అవుపిస్తాయి. అతడి పెదవులమీద ఎప్పుడూ చిరునవ్వు తొణికిసలాడుతూనే వుండేది.

ఒకనాడు రాత్రిభోజనాలదగ్గిర జొసపుతల్లి మామ్మూలుగా కొంతమందితో కూచుని యాదాలపంగా అంది. "ఎక్కడచూసినా రష్యాజెండా కనిపిస్తూంది. మన పాతహంగేరి జెండా చూడాలని నాకోరిక."

ఆదినాల్లో బుడాపేస్టులో తిండిగరువూఅ వుండేది. భోజనాల దగ్గిర వున్నవాళ్ళతో వొకనమ్మకస్తుడు జోసపుతల్లి మాటలు అవకాశంగా తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆమె అన్నమాటలు ఏవివో* వాళ్ళతో వూది లాభంపొంది తిండికిఇంత సంపాదించుకోవాలను అతడి ఊహ.

మర్నాడు వొచిన్న ట్రక్కు జోసపు ఇంటికివచ్చింది. దానిలో ఇద్దరు ఏవివొ మనుషులున్నారు. జోసపుతల్లిని ట్రక్కులో ఎక్కించుకుని ఎక్కడికో పట్టుకుపోయారు వాళ్ళు. ఆరుమాసాలదాకా ఆమెజాడలేదు. ఆరునెలలు తరవాత వొకనాడు హటాత్తుగా ఆమె ఇంటికి వచ్చింది. ఆమె బాగా అదిలిపోయివుందని ఆమెవైఖరివల్ల తెల్లమవుతూవుంది. అయినా మరేమి ఫరవాలేదని ఆమెపెదవులమీది చిరుంవ్వుతో తనవాళ్ళకి నమ్మకం కలిగించింది. ఏవివో వాళ్ళచేతుల్లో వున్నపుడు తనకేమీ ప్రమాదం జరగలేదనే చెప్పిందామె. కుటుంబంలోవాళ్ళు అందరూ ఆమెమీద ప్రశ్నపరంపరలు కురిపించారు. నిశ్చలంగా అన్నిటికీ వొక్కటే జవాబు చెప్పిం దామె. "ఏమీ జరగలేదు" అని. కాని కారాగృహంలో తిండీ తిప్పలూ లేకపోవడంవల్లా, అక్కడ ఆమెపడ్డ యాతనలవల్లా ఇంటికి వచ్చిన కొద్దికాలంలోనే ఆమె కాయలా పడింది. తుదకి చచ్చిపోతుందనే స్పష్టమయింది. అప్పుడు టూకీగా అతిమెల్లగా కొన్నిసంగతులు మాత్రం చెప్పిందామె. అయితే స్పష్టంగా మాత్రం ఏమీ చెప్పలేదు. గోడకి చెవులుంటాయ, తనమాటలు వింటే తన కుటుంబానికి ఏవయినా ప్రమాదం రావచ్చు. అనుకోకుండానే అవడైనా గుప్తచరుడు వినవచ్చు. ఎలా అయితేనేం తాను నిర్భంధంలో వున్న ఆరు


  • ఏవివో: Allam vedelmi osztag (A.V.O)

ప్రత్యేక రాజ్య రక్షణ సంస్ధ.