పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వికీపీడియా అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?


ప్రతి మనిషి ఒక సంపూర్ణ విజ్ఞానభాండారాన్ని
అందరితో పంచుకోగలిగే ప్రపంచాన్ని
ఊహించండి.
ఆ ఆశయానికి మేం నిబద్ధులం.

  • వికీపీడియా స్వేచ్ఛగా అంతర్జాలంలో అందుబాటులో ఉన్న విజ్ఞాన సర్వస్వము. వికీమీడియా ఉద్యమం యొక్క సుపరిచితమైన ప్రాజెక్టు వికీపీడియా. ఆ ఉద్యమంలో మూల పత్రాలు, పుస్తకాలు ఉండే వికీసోర్సు, సార్వజనీనంగా అందుబాటులో ఉండే డేటాసెట్లు కలిగి ఉన్న వికీడేటా, మీడియా భాండాగారమైన వికీమీడియా కామన్స్ వంటి స్వేచ్ఛా విజ్ఞాన ప్రాజెక్టుల కుటుంబం కూడా ఉన్నాయి.
  • సంపూర్ణ మానవ విజ్ఞానం స్వేచ్ఛగా మానవులందరికీ లభించేలా చేయడం వికీమీడియా ఉద్యమ లక్ష్యం.
  • మిగిలిన అన్ని వికీమీడియా ప్రాజెక్టుల్లాగానే వికీపీడియా కూడా స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమంలో భాగం. కనుక ఓపెన్ లైసెన్సు చేయబడిన సమాచారమే కలిగి ఉంటుంది, తద్వారా దాన్ని ఇతరులు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చు.
  • వికీమీడియా వెబ్‌సైట్లను ప్రతి నెలా 50 కోట్లమంది వీక్షిస్తూంటారు, ఇంకెంతో మంది దానిలో సమాచారం మిర్రర్ సైట్ల ద్వారా, ఆఫ్‌లైన్ కాపీల ద్వారా పొందుతూంటారు. చేరుకునేందుకు కష్టమైన సమూహాలు ఈ సమాచారాన్ని చేరుకునే మార్గాలు అన్వేషించే ఎన్నో పథకాలకు వికీమీడియా ఫౌండేషన్ మద్దతునిస్తుంది.
  • ఉదాహరణకు వికీపీడియా జీరో పథకం ద్వారా మొబైల్ సంస్థల నిర్వాహకులు అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దింపుకునే భత్యం

(డౌన్‌లోడ్ అలోవెన్స్) ద్వారా కాకుండా వికీపీడియా ఉపయోగించడాన్ని ఉచితం చేశారు. అలానే జాలేతర ప్రయత్నాల ద్వారా వికీపీడియా కాపీలను లాప్ టాప్ లకు ఎక్కించేవీ ఉన్నాయి.

  • సీఐఎస్ ఏ2కే అనేది భారతీయ భాషల్లో, దక్షిణాసియాలో స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమం అభివృద్ధి చెందడానికి ఉత్ప్రేరణ చెందేలా కృషి చేస్తుంటుంది.

వికీపీడియాతో సాంస్కృతిక సంస్థలు విజయవంతంగా పనిచేయడంలో మేము తోడ్పడతాము, మాతో పనిచేయడం ద్వారా మీరు మొత్తం వికీపీడియా సముదాయంతో కలవవచ్చు మరియు లెక్కించదగ్గ, నివేదించదగ్గ పద్ధతిలో ప్రభావాన్ని మీరు చూపించగలరు.

క్రైస్ట్ విశ్వవిద్యాలయంతో ఏర్పడిన భాగస్వామ్యం ద్వారా సీఐఎస్ ఏ2కే వివిధ భారతీయ భాషలలో వికీపీడియా వినియోగించడం, వికీలో రచనలు చేయడం వంటి విషయాలపై వీడియో ట్యుటోరియల్స్ రూపొందిస్తున్నారు. వివిధ భాషలలో రూపొందిస్తున్న ఈ వీడియోల నిర్మాణానికి వికీపీడియా వాలంటీర్లు, సంస్థ ఉద్యోగులు, విశ్వ విద్యాలయ సిబ్బంది, విద్యార్ధులు తదితరులు ఈ కృషిలో విశేషంగా కృషిచేస్తున్నారు. ఈ ట్యుటోరియల్స్ వివిధ భాషలలో వికీపీడియా పట్ల అవగాహన పెరగటానికి, వికీలో రచనలు చేయడం విషయంలో కొత్త వారికి మార్గదర్శకంగా ఉండేందుకు ఉద్దేశించినవి. ఎడిటదాన్లు, అవగాహనా సదస్సులు శిక్షణ కార్యక్రమాలు వంటి ఆఫ్ వికీ కార్యక్రమాలలోనే కాక అంతర్జాలంలోనూ అందుబాటులో ఉండి ఉపకరిస్తాయి. కళాశాలకు చెందిన గ్రీన్ వ్యూ స్టూడియోలో వీడియోల ప్రణాళిక, చిత్రీకరణ వంటివి జరుపుకున్నారు. కళాశాల విద్యార్థులు ఈ వీడియోల్లో నటించడం, గాత్రదానం వంటివి చేశారు. ఈ వీడియోలను వికీమీడియా కామన్స్ లో స్వేచ్ఛా లైసెన్సులతో చేర్చారు. ఈ ప్రాజెక్టును కళాశాల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాల్లో భాగంగా చేపట్టారు. వికీమీడియన్లకు కళాశాలలోని ఆచార్యులు, సిబ్బంది, విద్యార్థులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వికీమీడియా ఉద్యమానికి మరింత మానవ వనరులు అందుబాటులోకి వచ్చాయి.
  • వికీమీడియా వెబ్‌సైట్లు నెలకు 50 కోట్ల వీక్షకుల సంఖ్య కలిగి ఉన్నాయి
  • నెలకు 2100 కోట్ల వరకూ పేజీ వీక్షణలు
  • ప్రతి నెల 90 లక్షల వరకూ దిద్దుబాట్లు
  • వికీమీడియా కామన్సులో 2 కోట్ల 10 లక్షల దస్త్రాలు
  • ఒక్క ఆంగ్ల వికీపీడియాలోనే 45 లక్షలకు మించిన వ్యాసాలు
  • 285 భాషలలో 2 కోట్ల 50 లక్షలకు మించిన వ్యాసాలు