పుట:How to work successfully with wikipedia - telugu, indianised version.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలికట్ మెడికల్ కళాశాల, పాథాలజీ విభాగం-వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్

ప్రదేశం: కాలికట్, కేరళ
సంస్థ తరహా: విద్యాసంస్థ

గ్లాండ్యులర్ క్రమంలో అమరిన ప్రాణాంతక కణితి కణాలు చూపుతున్న తక్కువ శక్తిగల వీక్షణ (100X) - కాలికట్ మెడికల్ కళాశాల పాథాలజీ విభాగం సౌజన్యంతో

వివరణ

భారతదేశంలో మొట్టమొదటగా కాలికట్ మెడికల్ కళాశాల, పాథాలజీ విభాగంలో వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ స్థానం ఏర్పరిచారు. వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ గా పనిచేస్తున్న డాక్టర్ నేతా హుస్సేన్ కళాశాల వనరులు వికీమీడియాలో అందుబాటులోకి వచ్చేలా కృషిచేస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా పాథాలజీ విభాగానికి చెందిన స్పెసిమన్ల ఛాయాచిత్రాలు డిపార్ట్ మెంట్ ద్వారానే వికీమీడియా కామన్స్ లోకి స్వేచ్ఛానకలు హక్కుల్లో చేరుస్తారు. రోగి వివరాలు, పోలికలు గుర్తించేలాంటివి, అప్పటికే ప్రచురించినవి తప్ప మిగిలినవే ఎంచుకుంటారు. నిపుణులు ఆ ఫోటోకు తగిన వివరణను చేర్చి, వర్గీకరిస్తారు. ఆయా చిత్రాలను వికీమీడియా ప్రాజెక్టుల్లో ఉపయోగిస్తారు. పాథాలజీకి సంబంధించిన వ్యాసాలను కూడా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తారు.

వికీపీడియాలో పాథాలజీ అంశాల చర్చ పేజీల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అరుదైన పాథాలజీ కేసుల గురించి విస్తృతమైన చర్చకు ప్రయత్నిస్తున్నారు. కళాశాలలో స్వేచ్ఛా నకలు హక్కులు, స్వేచ్ఛా విజ్ఞానం వంటివాటికి సంబంధించిన విషయాలలో చైతన్యం పెరిగేందుకు వికీమీడియన్ ఇన్ రెసిడెన్స్ రాయబారిగా కృషిచేస్తున్నారు. ఈ కార్యక్రమం వల్ల కళాశాల వనరులు విస్తృతం అయిన ప్రయోజనాలు సాధిస్తున్నాయి.

ఫలితాలు, ప్రయోజనాలు

  • పాథాలజీ అంశానికి సంబంధించిన విలువైన పలు చిత్రాలు స్వేచ్ఛానకలు హక్కుల్లో వికీమీడియా కామన్స్ లో చేరుతున్నాయి.
  • పలు భాషల వికీపీడియాల్లో సంబంధిత వ్యాసాల్లో చిత్రాలు చేరడమే కాక సమాచారం కూడా అభివృద్ధి చేశారు.
  • పాథాలజీ విభాగం నిర్వహిస్తున్న లక్షలాది సంఖ్యలోని స్పెసిమన్ల సేకరణ సూత్రప్రాయంగా వికీమీడియా ప్రాజెక్టులకు అందుబాటులోకి వచ్చింది.
  • కళాశాల సిబ్బందితో వికీమీడియా సముదాయానికి అనుబంధం బలపడి, వారి ప్రత్యేక నైపుణ్యం వికీపీడియాకు ఉపకరిస్తోంది.
  • ప్రసార మాధ్యమాల్లో కార్యక్రమం గురించి విస్తృత ప్రచారం లభించింది.