పుట:Himabindu by Adivi Bapiraju.pdf/287

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

“ఎవరికి లాభము?” “లోకమునకు!” “నేను నాశనమైన లోకమునకు నష్టమేమి తమ్ముడూ?” “పారిజాత కుసుమమునే | వాంచించిన యొక భృంగము సిద్దిగనక నశియించిన చేటేమీ లోకమునకు? అమృతమునే వాంఛించిన అహిపతి యొక డాశ చెడియు నశియించిన చేటేమీ నరనారుల కావంతయు?” “అటు లనుటవలన జీవితము నెదుర్కొనలేని నీరసత్వమే తెలియ జేయును గాని....” “అయిన భయమేమి?” “మరల నీవు జన్మించి కర్మ దుర్విపాకము చెల్లించవలయునుకాదా” “కర్మ అనంతము చేసికొందుమనుకొనుము. అప్పుడు ఏమి యగును?” “అనంతముగ దుఃఖము నందుచుందువు.” •

  • దుఃఖము, ఆనందమునకు కావడికుండ. దుఃఖమైన, ఆనందమైన నేమి? రెండును ఒకటియ!”

“అది యందరకు తెలియును. ఈ వేదాంతవిచారము మన మను కొన్న కార్యములు జరుగనప్పుడు వచ్చునేమి? మనవాంఛలు తీరనప్పుడు లోక మంతయు దుఃఖమయ మగునేమి? బాగుగా చదువుకొంటివే? అదియకాబోలు ఆర్షధర్మము, బౌద్ధధర్మము బోధించినది! మా ఆటవిక జాతులు జీవితము నెదుర్కొనుటలో ఇట్టి మెట్టవేదాంతపు మాటలు మాటలాడరు సుమా!” “తమ్ముడూ! నన్నేమి చేయుమందువు?” “నీవు ప్రపంచ శిరోమణివి కాదగిన శిల్పివి. శిల్పము సృష్టి. చతుర్విధ పురుషార్థదాయిని. మానవుడు తన వాంచలను దివ్యము లొనర్చు కొన్నప్పుడే ఉత్తమ శిల్పి యగునన్న విషయము పెదనాయనగారు నీకు బోధించలేదా? నీవు నిజమగు విశ్వబ్రహ్మవై విరాట్ సృష్టిని చేయవలయును. ఆ శిల్పమంతయు లోకమునకు లేకుండ చేయుదువా? నీ వర్పించు శిల్పము నిన్ను నిర్వాణపథమునకు గొనిపోదా? ఇవి నీకు నేనా తెల్పవలసినది అన్నా! పో! దేశసంచారము చేయుము. అర్హతులకడ, మహరుల కడ శిల్పరహస్యముల నెరిగిరమ్ము.” | మహాబలగోండ ప్రభువు తనహృదయములోని యాలోచనలనే మాటలలో పైకి తెలిపినాడు. ఆశయసౌందర్యము నిర్వాణపథము. అది నశ్వరమగు భౌతికసౌందర్యము కాదు. భౌతికసౌందర్యము పరమావధి యైనను మానవునికి దుఃఖము కలుగజేయుటకే యగును. అడివి బాపిరాజు రచనలు - 2 • 277 • హిమబిందు (చారిత్రాత్మక నవల)