పుట:Himabindu by Adivi Bapiraju.pdf/275

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

అమృత: ఈ విచారణ ప్రస్తుత మనవసరముగాదా? ఈ విచారణ మనుష్యుడు చేసికొనును. మంచిదే! కాని జ్ఞానతృష్ణతో చేసినచో, తృష్ణయు దుఃఖమగునుకదా? కాక తన దుః ఖమును నాశనముచేసికొనుటకైనచో తాను, తన దుఃఖము, ఆ దుఃఖముపోవు నిధానము, తన గమ్యస్థలము తెలిసికొనగలడు. స్థాల: అవునయ్యా, ఆ తెలిసికొను విచారణలో మూలమునకు బోయినగాని అసత్యమిది, సత్యమిది యని ఎట్లు నిర్ధారణచేసికొనగలుగును? అమృత: అట్లగుగాక! తెలిసికొనినవెనుక మన మేమి చేయవలయను? తెలిసికొనగనే మనుష్యనిపని తీరిపోవునా? అతని దుఃఖము క్షయ మెట్లగును? కావున అది క్షయమగు విధానము నవలంబింప వలదా? ఫౌల: సత్యము. నీరునకు, సముద్రనీరమునకు మధ్య కొన్ని పదార్థము లడ్డమున్నవి. ఆ అడ్డము తీరుటే నీరము స్వస్వరూపమందుటకాదా! కనుకనే విచారణయు, జ్ఞానము ముఖ్యము. అటువెనుక ఆ అసతోను తొలగింపవలయును ఆ తొలగించునది తానే! తొలగించుటకు వేరుధర్మ మున్నదనిన ఆ ధర్మమునకు, తొలగించుటయును క్రియకు ఆధారమగు వేరువస్తు వుండవలయునా? ఈ పృథక్ష్వమే సత్యమునకు సార్థక్యము కల్పించు నేని అవి నాశనమగుచున్నవి. నాశనమగునవి సత్యములు కావుగదా? అమృతః స్వామీ! మీరు చెప్పినవన్నియు మేము ఒప్పుకొందుము. స్థాల: జ్ఞానముకలవాడు ఒప్పుకొనవలయును. అయినచో సత్యమై అన్నిటికి ఆధారమగునది " బ్రహ్మము. అమృత: అందుండి ఈ విశ్వము వచ్చునా? స్థాల: అందుండి వచ్చుటయేమి? అదియే ఇది. అమృతః అయినచో ఈ దుఃఖము అదియేనా? ఈ చావు అదియేనా? ఈ ఈతిబాధలు, ఈ తాపత్రయములు, ఈ ఈషణత్రయములు, ఈ అరిషడ్వర్గములు అదియేనా? స్టాల: ఆ పదార్థమున కాభాసలే ఇవి.. అమృత: మీరు బ్రహ్మ మందురు. మేము నిర్వాణ మందుము. స్వామీ! మొదటి కారణమనుచు లేదు. ఈ కారణపరంపర “ప్రతిద్యసముత్పదం పశ్యంతి తే ధర్మం పశ్యంతి మే ధర్మం పశ్యంతి స బుద్ధం పశ్యతి” అన్నట్లు యీ కారణపరంపర కర్ద మెరిగినవాడే బుద్దుడు. యీ కారణములలో నొక్కొక్కటికి తక్కిన వాధారములు. తక్కినవానికి, ఇదియు తక్కినదియు ఆధారములు. స్థాల: ఇదియేకదా సాంఖ్యము చెప్పునది? నీవు క్రొత్తగా చెప్పు విచిత్ర మేమున్నది? ప్రకృతిసహితుడగు పురుషుడు సృష్టి, ప్రకృతిత్యక్త పురుషత్వమే జీవుని కర్మరాహిత్యము. | కారణమనంతమయినచో కారణ విముక్తి ఎట్లు? నిర్వాణ మెట్లు? అమృత: “కర్మజం లోకవైచిత్ర్యం.” సర్వకాలము సృష్టిలో మార్పు జరుగుచున్నదిగదా? “నోచ నిరోధోస్తినచభవోస్తి సర్వదా అజ్ఞాతం అనిరుద్ధంచ, తస్మాత్ సర్వ ఇదం జగత్.” సృష్టిలేదు, నాశనములేదు, మొదలులేదు, తుదలేదు. స్థాల: ఓయి వెర్రివాడా, మార్పు జరుగుచున్నదియు అసత్యము. యీ వస్తువు లున్నవియు అసత్యము. అసత్యములుకాని సత్యము ఒక్కటి లేదా? నీవు సంసారము సత్యమందువు. మార్పు సత్యమందువు అయినచో కర్మ సత్యము కాదా? ఇంక కర్మక్షయమై నిర్వాణ మెట్లోందగలవు? నీ నిర్వాణమున “సర్వాణి నిరచర్చంతి దుఃఖాదయోస్మి న్నిత అడివి బాపిరాజు రచనలు - 2 • 265 • హిమబిందు (చారిత్రాత్మక నవల)