పుట:Himabindu by Adivi Bapiraju.pdf/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

నాగబంధునిక పూర్తిగ మెలకువవచ్చి సువ్వునలేచి, “ఇదియేమి ఇచ్చట నుంటిని! ఏమి జరిగినది సేనాపతీ!” యని యామె యాశ్చర్యమున నడిగినది. | నాడిచూచి వైద్యు డా బాలికకు ఏమియు మొప్పము లేదనెను. ఎచ్చటను ఎముక విరుగలేదనియు, నట్లువిరిగినచో నాడీగతి వేరగుననియు నా వైద్యుడు సమదర్శికి చెప్పి తనపనిపై తాను పోయేను.. నాగబంధునిక గుఱ్ఱము భక్తిగదురు చూపులతో తన యజమాను రాలిని చూచుచు నిలుచున్నది. ఇరువురును తన తమ బసలకు వెళ్ళి పోయిరి. నాగబంధునికకు పూర్తిగ మెలకువ వచ్చినంతనే తాను సమవర్తిని ముద్దుగొంటినని యెంతయో సిగ్గుపడెను, ఆనందమందెను, క్రుంగిపోయెను, ఉప్పొంగిపోయెను. ఆమె పూర్తిగా యోషావేషము ధరించి, సిద్దార్థినికను సువ్వుననెత్తుకొని, యామెను హృదయమున కదుముకొని, ఆమె పెదవుల ముద్దుగొనెను. | సిద్దార్థినిక అక్కను తిరిగి కౌగిలించి “అక్కా! నీవు యుద్ధము చేయుచున్నావటగా! నాకు అన్న చెప్పినాడు. నీవు సమవర్తిని ప్రేమించుచున్నావటగా” అని యడిగెను. “ఛీ ఛీ! అ వేమి మాటలే సిగ్గులేని తల్లీ! అని నాగబంధునిక నవ్వుచు చెల్లెలిమొగ్గ నులిమినది. సిద్దార్ధినిక నవ్వుచు, “దొంగక్కా! అన్న నాకన్నియు చెప్పినాడులే!” యన్నది. “అన్న మంచివాడు కాడు! అన్నతో మాట్లాడకూడదు!” “అన్నతో మాట్లాడక, అన్నదగ్గరకు పోకపోతే అన్నకు భయమా ఏమి? మాటలు మాటలువచ్చి అన్న అమ్మకు చెప్పుచున్నప్పుడు నేను వింటిని.” “అవునే, తల్లీ?” అని తల్లి ప్రశ్నింప నాగబంధునిక ఆమెపాదాలకు నమస్కరించినది. శక్తిమతి కొమరిత నాశీర్వదించి “అమ్మా!నాయన గారితో నీ విషయము చెప్పినాను. నాయనగారు వెంటనే శ్వేతకేతులవారిని వెంటగొని చారుగుపులను, కీర్తిగుప్తులను, వినయభిక్కులవారిని, శ్రీచక్రవర్తులను చూచి వచ్చినారు. అమృతలతా దేవిగారిని నేనును కలిసికొంటిని. ఆమె తన తండ్రిని కలిసికొని ఏ విషయము తెలిపెద నన్నది. శక్తిమతీదేవి నాగమ బిగియార కౌగిలించుకొని మూర్థమును ముద్దు గొన్నది. నాగబంధునిక సిగ్గుగదుర నేదియే స్వప్నములుగనుచు నిలుచుండిపోయినది. సిద్దార్ధినిక గంతులువేయుచు, “ఇంక బావమీద పాటలు పాడ వచ్చును, ఎంతో చక్కగా! “బావా బావా పన్నీరు బావనుపట్టుకు తన్నేరు” శక్తిమతి: బావ మళ్ళీ తన్నినచో? సిద్దార్థినిక: అమ్మా! ఎక్కడైనా మగవారిని ఆడవారు తన్నుట ఉన్నది. ఆడవారిని తన్నెద | "రేమిటి? శక్తిమతి: ఎవరు తల్లీ మగవారిని తన్నిన ఆడవారు? సిద్దార్దానిక: సత్యభామ తన్నలేదా శ్రీకృష్ణుని? శక్తిమతి: సత్యభామ శ్రీకృష్ణునిభార్య కనుక తన్నవచ్చును. మరదలు తన్నునా? నాగబంధునిక: చెల్లీ! నీవే తన్నవే, నీకు ఆనతి ఇస్తాను. అడివి బాపిరాజు రచనలు - 2 • 255 • హిమబిందు (చారిత్రాత్మక నవల)