పుట:Hemalatha by Sri Chilakamarthi Lakshmi Narasimham.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమలత

యీ క్రొత్త యధికారి యాతనికెప్పటియట్లు బ్రాహ్మణు లన్నము పెట్టవచ్చునని యుత్తరువుచేసెను. వారాప్రకారముగా జేయుచుండిరి. ఈసాహేబు మతవిషయమైన పట్టుదలగలవాడని మహమ్మదీయులెఱిగి మౌలవిని గారాగృహమునుండి విడువమని సాహెబును బలవంత పెట్టసాగిరి. వారి ప్రోత్సాహమునకును స్తోత్రములకును సాహేబు మిగులనుప్పొంగియొకనాడు చక్రవర్తి వద్దనుండి తనకు త్తరువు వచ్చెనని మౌలవిని విడుదలచేసెను. తోడివానిని విడిచి తన్ను బాధించుచు నారాయణ సింగునకు గష్టముగనుండుటకు మాఱుగ మౌలవి స్వేచ్ఛగా పక్షమున దనవిషయమై పనిచేసి తనకు బంధవిమోచన గల్గించునని సింగు సంతోషించుచుండెను. మౌలవియును విడువ బడినతోగనే త ముసలినెచ్చెలికి సాయము చేయుదునని వాగ్దానముచేసి తద్విషయమయి ప్రయత్నము చేయుచుండెను.