పుట:Hello Doctor Final Book.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రాసి ‘తెలుగుతల్లి కెనడా’ అంతర్జాల పత్రికలో ప్రచురించి, ఆ పిమ్మట ముఖ పుస్తకములో కూడా నిలిపి అందరికీ అందించారు.

ఆలోపతి వైద్యంలో విషయాలు అన్నీ ఆంగ్లభాషలో ఉన్నా వాటి

మూలములు గ్రీకు, లాటిన్ భాషలలో ఉంటాయి. అవి సామాన్యులకు అరమ ్థ వటం కష్టము. వివిధ రంగాలలో సాంకేతిక శాస్త్రపరిజ్ఞానాన్ని మన తెలుగుభాషలో అందించుటకు పలువురు ప్రయత్నము చేసారు. వారిలో కీ.శే. ఆచంట

వేంకటరాయ సాంఖ్యాయన శర్మగారు (1864-1933) ప్రముఖులు. వారు

మహా మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. వారు భూగర్భ శాస్త్రము, రసాయన శాస్త్రములను తెలుగులో వ్రాసారు. స్వయంగా ఒక సాహిత్య పత్రిక “కల్పలత’’ పేరుతో నడిపి అందులో వారి రచనలు ముద్రించేవారు. వారు శతావధాని,

అష్టావధాని. వారు ‘లలిత’ అను మొదటి తెలుగు కథ వ్రాసారు. వారి

రచనలన్నీ కాలంతో పాటు కరిగి పోయాయి. శ్రీ వేంకట పార్వతీశ్వర

కవులవలన కొంత సమాచారము మన తరానికి దక్కింది. శ్రీ వసంతరావు వెంకటరావు గారు, శ్రీ మహీధర నళినీమోహను గారు, భౌతిక, రసాయన

శాస్త్ర విషయాలను తెలుగులో తెలియపరచారు. వారి ప్రయత్నములు కొన్ని రంగాలకు, కొన్ని విషయాలకు పరిమితము అయ్యాయి.

వీరి కోవకు చెందినవారే డా. గన్నవరపు నరసింహమూర్తి గారు. వీరు

ఆలోపతి వైద్యశాస్త్ర విషయములపై ఎక్కువ శ్రద్ధ నిలిపి తను చదివిన చదువులు తెలుగు వారందరికీ చెందాలనే బృహత్సంకల్పముతో ‘ఆరోగ్యము

- వైద్యము’ తో మొదలిడి వ్యాసపరంపర వ్రాసారు. ఆ వ్యాసములు ‘తెలుగుతల్లి కెనడా’ వారు ‘హలో డాక్టర్!’ శీర్షిక క్రింద ప్రతి నెలా ప్రచురించుట అత్యంత ముదావహము.

ప్రజలకు ఆరోగ్యము - వైద్యము చేరువ జేయాలనే మంచి సంకల్పముతో

ఆ అమూల్యమైన వ్యాసాలను ‘హలో, డాక్టర్ !’ అను పుస్తక రూపములో

ప్రచురించుటకు డా. నరసింహమూర్తిగారు, ‘తెలుగుతల్లి కెనడా’ వారు పూను కొనుట యావదాంధ్ర భాషాభి మానులకు సంతోషదాయకము.

viii ::