పుట:Hello Doctor Final Book.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ స్టాటిన్లను వాడేటప్పుడు కాలేయ జీవోత్ప్రేరకములను (Liver enzymes) రెండు మూడు నెలలకు ఒకసారి ఒక ఆరుమాసములు ఆపై ప్రతి ఆరుమాసములకు పరీక్ష చేయాలని సూచిస్తారు. ఆవి రెండు మూడు రెట్లు పెరుగుతే స్టాటిన్లను మానవలసిన అవసరము కలుగవచ్చును. ఈ స్టాటినుల వలన తీవ్ర కాలేయవ్యాధులు చాలా, చాలా అరుదు. గుండెవ్యాధులు అరికట్టబడి ఆయుస్సు పెరిగే అవకాశమే చాలా ఎక్కువ.

స్టాటినులు cytochrome - P450 ఎంజైముల ద్వారా ఛేదింపబడి విసర్జింపబడుతాయి కనుక P450 ఎంజైముల ద్వారా విసర్జింప బడే  ఔషధాలను వాడవలసి వచ్చేటప్పుడు స్టాటిన్లను తాత్కాలికముగా ఆపి వేయాలి. ఎరిత్రోమైసిన్ (erythromycin) సంబంధ ఔషధులు, జెమ్ ఫైబ్రొజిల్ (gemfibrozil), కీటోకొనజాల్ (ketoconazole), ఇట్రాకొనజాల్ (itraconazole), మందులు కొన్ని ఉదాహరణలు. వీనిని వాడునపుడు స్టాటినులను తాత్కాలికముగా ఆపివేయాలి.


పైత్యరసామ్లములను వేఱ్పరచు మందులు  (Bile acid sequestrant resins):

కొలిస్టరమిన్ (cholestyramine), కొలిస్టిపొల్ (colestipol), వంటి మందులు పైత్యరసామ్లములతో కూడి, ఆంత్రముల ద్వారా కొలెష్ట్రాల్ మరల గ్రహించబడకుండా చూస్తాయి.

నయాసిన్ (niacin), ఎజెటిమైబ్ (ezytimibe) మందులు కూడా కొలెస్ట్రాల్ తగ్గించుటకు ఉపయోగ బడుతాయి. PCSk9 అవరోధకము :

ఎవొలోకుమాబ్ (Evolocumab) అను ఔషధము  pro protein convertase subtilisin/kexin type 9 అనే మాంసకృత్తిని అవరోధించు ఏకరూపప్రతిరక్షకము(monoclonalantibody).PCSK9  కాలేయములో LDL విచ్ఛేదన గ్రాహకములను నిరోధించి కాలేయకణములలో చెడు కొలెష్ట్రాలు విచ్ఛేదనమును మందగింప జేస్తుంది. PCSK9 ని అవరోధించి ఎవొలోకుమాబ్ చెడు కొలెష్ట్రాల్ విచ్ఛేదనమును ఇనుమడింపజేసి రక్తములో LDL కొలెష్ట్రాల్ విలువలు తగ్గిస్తుంది. ఈ మందు చాలా ఖరీదైనది కావున

56 ::