పుట:Hello Doctor Final Book.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఫర్ (Malassezia  furfur), లేక మలస్సీజియా గ్లోబోజా (Malassezia globosa)  అనే మధుశిలీంధ్రములు (yeast) వలన కలుగుతుంది.

మలస్సీజియా ద్విరూపి ( dimorphic ). ఇది మొగ్గలు తొడిగే (budding) మధుశిలీంధ్రపు రూపములో గాని, శాఖలు కట్టే  పోగుల (branching hyphae) శిలీంధ్రరూపములో గాని, రెంటిగా గాని (spaghetti  and meat ball appearance) సూక్ష్మదర్శిని క్రింద కనిపిస్తుంది.

మలస్సీజియీ చాలామందిలో చర్మము పై హాని కలిగించకుండా మనుగడ సాగిస్తాయి. కొందఱిలో మాత్రము ముఖ్యముగా, వ్యాధి నిరోధక శక్తి లోపించినవారిలోను, కార్టికోష్టీరాయిడులు (corticosteroids) వాడేవారిలోను, గర్భిణీస్త్రీలలోను, ఆహార లోపములు ఉన్నవారిలోను, మధుమేహవ్యాధి కలవారిలోను, సోబిని కలిగించవచ్చును. వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నపుడు, వాతావరణములో తేమ అధికముగా ఉన్నపుడు చెమట ఎక్కువగా పట్టే వారిలోను సోబి తఱచు కనిపిస్తుంది. సోబి  కలిగినవారిలో చర్మముపై  గోధుమరంగు, గులాబిరంగు, ఎఱుపురంగు, రాగిరంగు మచ్చలు పొడచూపుతాయి. ఈ మచ్చలు విడివిడిగా కాని కలిసిపోయి కాని కనిపించవచ్చును. మచ్చల అంచులు నిర్దుష్టముగా ఉంటాయి. వీటిపై సన్నవి పొలుసులు (scales) ఏర్పడి బూడిదలా పొట్టు రావచ్చును. తెల్లగా ఉన్నవారిలో వేసవి కాలములో చర్మపురంగు ఎక్కువ అగుటచే , సోబిమచ్చలు బాగా కనిపిస్తాయి.

కొందఱిలో మలాస్సీజియా ఫర్ ఫర్ ఎజెలైక్ ఆమ్లము  (azelaic acid) ఉత్పత్తిచేయుట వలన ఆ ఆమ్లము టైరొసినేజ్ (tyrosinase) అనే జీవోత్ప్రేరకమును (enzyme) నిరోధించి, మెలనిన్ (melanin) అను చర్మవర్ణకపు ఉత్పత్తిని తగ్గించుట వలన  సోబిమచ్చలు వర్ణహీనత (hypopigmentation) పొందుతాయి. వ్యాధి నిర్ణయము :

సోబిని (Tinea versicolor) సాధారణముగా చూసి పసిగట్ట

410 ::