పుట:Hello Doctor Final Book.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40. శిలీంధ్ర చర్మ వ్యాధులు - 2 ( Fungal skin diseases - 2 ) గడ్డ పు తామర (Tinea barbae) :

గడ్డపు తామర, చర్మాంకురములు (Dermatophytes) ట్రైఖోఫైటన్ మెన్టగ్రోఫైట్స్  (Trichophyton  mentagrophytes), ట్రైఖో ఫైటన్ వెర్రుకోసమ్  (Trichophyton verrucosum) వలన కలుగుతాయి. ఇవి మనుజులనుంచి మనుజులకు లేక జంతువులనుంచి మనుజులకు,  వ్యాప్తిచెంది రుగ్మతలను కలిగిస్తాయి. ఒకరి గడ్డపుకత్తె మరొకరు ఉపయోగించుట వలన కూడా శిలీంధ్రములు వ్యాపించగలవు. రైతులలో ఎక్కువగా ఈ వ్యాధులు పొడచూపుతాయి. ఉష్ణప్రాంతములలో నివసించేవారిలో గడ్డపుతామర కలిగే అవకాశములు ఎక్కువ. గడ్డము, మీసపు ప్రాంతములలో చర్మమును, రోమ కూపములను, రోమములను ఆశ్రయించి శిలీంధ్రములు తాపము కలిగిస్తాయి. వ్యాధిలక్షణములు :

గడ్డపు చర్మములో ఇవి తామర కలుగజేసినపుడు ఎఱుపు లేక

407 ::