పుట:Hello Doctor Final Book.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధోహనువు నాడి (mandibular nerve) ప్రభావితమైతే నోటిలో క్రిందిదవుడ, నాలుక, క్రిందిదవుడ యిగుళ్ళలో పొక్కులు, పుళ్ళు కలుగుతాయి. క్రిందిదవుడ చర్మముపై విస్ఫోటము పొడచూపవచ్చును. నోటిలో అగ్గిచప్పి వలన పొక్కులు పుళ్ళు ఏర్పడితే అవి ఒక ప్రక్కనే ఉండుట వలన వ్యాధిని వైద్యులు పసిగడుతారు. నోటిలో మేఖల విసర్పిణి కలుగుతే నాడులతో బాటు రక్తనాళములు తాప ప్రభావమునకు లోనయితే దంతపువ్యాధులు, యిగుళ్ళ వ్యాధులు, దంతనష్టము, దౌడ యెముకలలో అస్థినిర్జీవత (osteonecrosis), ఎముకల విచ్ఛిన్నము సంభవించవచ్చును. వ్యాధినిర్ణయము :

విస్ఫోటము దేహములో ఒక ప్రక్కకు ఒక నాడీపాలిత చర్మ విభాగమునకు (Dermatome) ఒక పట్టీ వలె పరిమితమయి అగ్గిచప్పిని (మేఖల విసర్పిణి) సూచిస్తాయి. ఈ వ్యాధిలో సలుపు, మంట, నొప్పి ఎక్కువగా ఉండి దురద పాలు తక్కువయి అగ్గిచప్పిని సూచిస్తాయి. పొక్కుల రసితో డి.ఎన్.ఎ గుణకార చర్యతో (Polymerase Chain Reaction) విషజీవాంశములను కనుగొనవచ్చును. రసిని గాజు పలకపై నెఱపి Tzanck వర్ణకముతో  సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి వ్యాధి ధ్రువీకరణ చేయవచ్చును. రక్తపరీక్షలలో VZV కి IgM ప్రతిరక్షకములను కనుగొని వ్యాధిని నిర్ధారించవచ్చును. చికిత్స : నొప్పి మందులు :

విస్ఫోటమునకు జింక్ ఆక్సైడు పూతలు కొంత ఉపశమనము కలిగిస్తాయి. నొప్పికి ఎసిటెమైనోఫెన్, పారసిటమాల్ లు వాడవచ్చును. కొందఱికి కొడీన్, హైడ్రోకొడీన్, నల్లమందు (Opium) వంటి మత్తిచ్చే నొప్పి మందులు అవసరము పడవచ్చును. లైడొకేన్ వంటి మందులతో తాత్కాలికముగా స్పర్శను, వ్యధను ఆయా ప్రాంతములలో అరికట్టవచ్చును. విషజీవాంశ నాశకములు ( Antiviral medicines ) :

VZV పై పనిచేసే ఎసైక్లొవీర్ (Acyclovir), వాలసైక్లొవీర్ (Va:: 370 ::