పుట:Hello Doctor Final Book.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవయవాలకు, కణజాలమునకు యింధనముగా చేరుతుంది.

మధుజని (Glycogen) ఉత్పత్తిని మధుజనిజాతము (Glycogenesis) అని అంటారు. శక్తి అవసరమయినప్పుడు, రక్తములో చక్కెర (Glucose ) స్థాయి తగ్గినప్పుడు, కాలేయము, కండరములలో మధుజని (Glycogen) మధుజని విచ్ఛిన్నము (Glycogenolysis) అనే ప్రక్రియతో చక్కెరగా విచ్ఛిన్నమవుతుంది. క్రొవ్వుపొరలలోని క్రొవ్వు నుంచి శర్కర నవజాతము (Gluconeogenesis) అనే ప్రక్రియ వలన చక్కెర (Glucose) ఉత్పత్తి అవుతుంది. ఈ చక్కెర రక్తము ద్వారా కణజాలమునకు, చేరి వినియోగ పడుతుంది.

సాధారణముగ రక్తపు చక్కెర విలువ పరగడుపున (ఉపవాస విలువ; Fasting values) 80 మి.గ్రా నుంచి 100 మి.గ్రాముల వఱకు ఉంటుంది. భోజనము చేసిన రెండుగంటల తరువాత పరీక్షిస్తే చక్కెర 140 మి.గ్రా. వఱకు ఉండవచ్చును. ఉపవాసపు చక్కెర విలువ 126 మి.గ్రా మించినా, రెండు గంటల భోజనానంతరపు చక్కెర విలువ 200 మి.గ్రా మించినా మధుమేహవ్యాధి ఉన్నదని నిర్ణయించవచ్చును. ఈ విలువల దరిదాపులలో ఉంటే శర్కర అసహనము (Glucose Intolerance) గాను, మధుమేహ వ్యాధికి చేరువలో (Borderline Diabetes) ఉన్నట్లుగాను పరిగణించి వ్యాధి నివారణకు కృషి చెయ్యాలి. మధుమేహవ్యాధికి కారణాలు :

జీర్ణాశయపు సమీపమున దిగువగా ఉన్న క్లోమగ్రంధి (Pancreas) క్లోమరసమును ఉత్పత్తి చేసి ఆహారము జీర్ణమవుటకు తోడ్పడుతుంది. ఆ క్లోమరసము క్లోమనాళము ద్వారా చిన్నప్రేవుల తొలిభాగము డుయోడినంకు (duodenum) చేరుతుంది. క్లోమగ్రంధిలో చిన్న చిన్న దీవులుగా (Islets of Langerhans) ఉండే బీటా కణములు (beta cells) ఇన్సులిన్ (insulin) అనే వినాళరసం ను (hormone) స్రవించి రక్తము లోనికి విడుదల చేస్తాయి. ఈ దీవులలో ఉండే ఆల్ఫా కణములు (alpha cells) గ్లూకగాన్ (Glucagon) అనే

27 ::