పుట:Hello Doctor Final Book.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2. మధుమేహవ్యాధి

(Diabetes mellitus)

క్రీస్తు పూర్వము 1500 సంవత్సర ప్రాంతములోనే “మధుమేహవ్యాధిని" భారతీయ వైద్యులు వర్ణించారు. ఈ వ్యాధిగ్రస్థుల మూత్రము చుట్టూ చీమలు చేరడము గమనించి, వారి మూత్రము మధురమని గ్రహించారు. ఈజిప్టు దేశపు వైద్యులు ఆ వ్యాధిని అతిమూత్రవ్యాధిగా వర్ణించారు. శుశ్రుతుడు, చరకుడు మధుమేహవ్యాధి రెండు విధములని, పిల్లలలో ఒక రకముగను, పెద్దలలో వేఱొక లక్షణములతో ఉంటుందని పసిగట్టారు. చిరకాలము క్రితమే కనుగోబడిన యీ వ్యాధి ప్రాబల్యము ఇరువది శతాబ్దములో బాగా హెచ్చినది. ఒకప్పుడు ధనిక వర్గాలలో ప్రాబల్యమైన యీ వ్యాధి యీ తరములో పేద, మధ్యతరగతి వారిలో విరివిగా పొడచూపుచున్నది.

రక్తములో చక్కెర:

శరీరమునకు అవసర మయ్యే శక్తి ఆహారము ద్వారా మనకు లభిస్తుంది. ఆహారపదార్ధాలలో పిండిపదార్థములు (Carbohydrates), క్రొవ్వులు (Fats), మాంసకృత్తులు (Proteins) శక్తిని ఇస్తాయి. వాటి నుంచి లభ్యమయ్యే శక్తిని (ఉష్ణమును) కాలరీలుగా (Calories) కొలుస్తారు.

శరీర సాధారణ జీవప్రక్రియలకు (metabolism) కొన్ని కాలరీలు ఖర్చవుతాయి. మనము పడే శారీరక శ్రమ, వ్యాయామము, క్రీడలకు, బాల్య కౌమారక అవస్థలలో పెరుగుదలకు అదనముగా శక్తి వెచ్చింపబడుతుంది. పెరుగుదల నిలిచాక మనకు ఆహారపు టవసరాలు తగ్గుతాయి. దైనందిక అవసరాలకు మించి తినే తిండి కాలేయము (Liver), కండరములలో మధుజని (Glycogen) అనే సంకీర్ణ శర్కర (complex carbohydrate) గాను, చర్మము క్రింద పొరలో (Adipose tissue) కొవ్వుగాను, ఇన్సులిన్స హకారముతో దేహము అంతటా నిలువవుతుంది. రక్తములో చక్కెర గ్లూకోజు (Glucose) రూపములో ప్రవహించి దేహములో కండరములకు, వివిధ

26 ::