పుట:Hello Doctor Final Book.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భయపెడుతూ అవసరం లేని పరీక్ష లెన్నో నిర్వహించి నిలువు దోపిడీ చేస్తున్న ప్రస్తుత సమయంలో... అనేక రోగాల గురించి రాశారు. రోగ లక్షణాలను, రోగ కారణాలను, నివారణలను, చేయవలసిన పరీక్షలను, వాడవలసిన మందులను, తీసుకోవలసిన జాగ్రత్తలను ఎంతో వివరంగా తెలియ చేశారు ఈ పుస్తకంలో. ఉదాహరణలతో బొమ్మలతో సహా తెలియచేసి బాధితుల పక్షాన నిలబడి మనోధైర్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు రచయిత. తమకు తెలిసిన దానికి గర్వ పడిపోతూ... నలుగురికి దానిని ఒక బ్రహ్మ పదార్థంగా చూపించి భయపెట్టే ఈ కాలంలో... తమ అనుభవాలను, వృత్తిపరమైన జ్ఞానాన్ని సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో రాశారు ఇందులో. ‘వైద్య పారిభాషక పదాలను’ తెలుగులోకి అనువాదం చేసి సవివరంగా వివరించారు ఈ వైద్య నారాయణుడు. ‘హలో... డాక్టర్’ అనే ఈ గ్రంథం ప్రతి ఇంటిలోనూ, ప్రతి గ్రంధాలయంలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఉండ తగినది. అందరూ చదివి, నలుగురికి బహుమతిగా పంచ తగినది. వృత్తిధర్మంలో భాగంగా పరదేశాలకు వెళ్ళినా పుట్టిన గడ్డను మాతృభాషను మరువకుండా ఎంతో ఆసక్తిగా ఈ రచనలను కొనసాగించారు డాక్టర్ గన్నవరపు నరసింహమూర్తి గారు. ఎంతో శ్రమకోర్చి చేసిన ఈ రచన మానవ సమాజం పై వారికి ఉన్న అపరిమితమైన ప్రేమకు మచ్చుతునక. విశ్వైక ప్రేమ, వసుధైక కుటుంబం అంటూ ఉపన్యాసాలు చేసేకంటే ఇటువంటి మంచి రచనల ద్వారా తమ జ్ఞానాన్ని నలుగురికి పంచడం హర్షించదగిన విషయం. వారు మరిన్ని ఇటువంటి గ్రంథాలను రచించాలని ఆశిస్తూ.... అభినందనలతో జ్వలిత జె.డి. పబ్లికేషన్స్ 13-08-2021, హైదరాబాద్.

xviii ::