పుట:Hello Doctor Final Book.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1980 వ సంవత్సరంలో భారత దేశాన్ని వదిలినా, భాష పట్ల వారికున్న మమకారానికి, భవిష్యత్తరాలకి భాషనందించాలనే వారి తపనకి మనఃపూర్వక అభినందనలు.

భాషలో ఌప్తమవుతున్న అక్షరాల గురించి కలత చెందుతూ ‘ఱ’ ని తమ రచనలలో విరివిగా వాడకంలోకి తెచ్చి, కెనడాలో “బండి ఱ డాక్టరు “గా గుర్తింపు పొందిన డా గన్నవరపు నరసింహమూర్తిగారు పూర్తి సమయం తమకు ఇష్టమైన సాహిత్య గ్రంథ పఠనములో, రచనా వ్యాసాంగాలలో గడుపు తున్నందుకు ఆనందిస్తూ, వారి కలంనుంచి అనేకమైన చమత్కార పద్యాలు, సమాజానికి ఉపయోగపడే వైద్యపరమైన వ్యాసాలూ వెలువడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమతి రాయవరపు లక్ష్మి

తెలుగుతల్లి కెనడా పత్రిక సంపాదకురాలు

xvi ::