పుట:Hello Doctor Final Book.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిమ్నసిరలలో రక్తపుగడలు ్డ ఏర్పడినప్పుడు రక్తప్రవాహము మందగించి సిరలలో రక్తసాంద్రత (congestion) పెరుగుతుంది. అందువలన ఆ కాలు (లేక చేయి) పొంగుతుంది. నొప్పి, సిరలను తాకినపుడు, నొక్కినపుడు నొప్పి కలుగుట (tenderness), వెచ్చదనము, ఎఱ్ఱదనము కూడా పొడచూపితే పొడచూపవచ్చు. పొంగు ఒక కాలిలోను లేక ఒక చేతిలోను కనిపించినపుడు నిమ్నసిర రక్తఘనీభవనమును వైద్యులు దృష్టిలో ఉంచుకొని పరిశోధించాలి.. హృదయవైఫల్యము (Congestive heart failure), కాలేయ వైఫల్యము (liver failure), మూత్రాంగముల వైఫల్యము (renal failure), పాండురోగము (anemia), రక్తపు మాంసకృత్తులు తగ్గుట (hypoproteinaemia) వంటి వ్యాధులలో పొంగు రెండు కాళ్ళలోను కనిపిస్తుంది. బూరకాలు  వంటి రసినాళికలలో (lymphatics) ప్రవాహమునకు అవరోధము కలిగించే వ్యాధులు సాధారణముగా దీర్ఘకాలిక వ్యాధులు. పుపుసధమనులలో అవరోధక పదార్థములు ( Pulmonary arterial embolism ) :

కాళ్ళ నిమ్నసిరలలోను, చేతుల నిమ్న సిరలలోను ఏర్పడే రక్తపుగడ్డలు బృహత్ సిరల ద్వారా హృదయపు కుడిభాగమునకు, ఆపై పుపుస ధమని, దాని శాఖలకు చేరి ఊపిరితిత్తుల రక్తప్రసరణకు అవరోధము కలిగించినపుడు ఊపిరితిత్తులలో పుపుసగోళముల (alveoli) నుంచి ప్రాణవాయువు రక్తమునకు చేరదు. రక్తములో బొగ్గుపులుసు వాయువు విసర్జింపబడదు. పుపుస ధమనిలో రక్తపు పోటు పెరిగి  కుడి జఠరికపై పని ఒత్తిడి పెరుగుతుంది.

151 ::