పుట:Hello Doctor Final Book.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధుమేహవ్యాధి ( Diabetes mellitus ):

మధుమేహవ్యాధి కాలము, తీవ్రతతో దూరధమని వ్యాధి కలిగే అవకాశములు పెరుగుతాయి. మధుమేహవ్యాధి కలవారిలో దూరధమనివ్యాధి కలిగే అవకాశము రెండింతలు అవుతుంది. కొవ్వులు, కొలెష్ట రాలు :

అల్ప సాంద్రపు కొలెష్టరాలు (low density lipoprotein) హెచ్చుగా ఉన్నవారిలోను, అధిక సాంద్రపు కొలెష్టరాలు (high density lipoprotein) తక్కువగా (40 మి.గ్రా/డె.లీ కంటె తక్కువ) ఉన్నవారిలోను, ట్రైగ్లిసరైడులు హెచ్చుగా ఉన్న వారిలోను ఈ వ్యాధి ప్రాబల్యము హెచ్చు. రక్తపీడనము అధికమైన (hypertension) వారిలోను, దీర్ఘకాల మూత్రాంగ వ్యాధిగ్రస్థులలోను (chronic kidney disease) దూరధమని వ్యాధి ప్రాబల్యము అధికముగా ఉంటుంది. వ్యాధిలక్షణములు :

దూరధమని వ్యాధిగ్రస్థులలో ప్రామాణిక లక్షణము సవిరామపు పోటు (intermittent claudication). ఈ పోటు కాలిపిక్కలో (calf) కొంత దూరము నడిచిన పిదప క్రమరీతిలో కలిగి, విశ్రాంతి తీసుకొన్న పది నిమిషములలో క్రమరీతిలో ఉపశమిస్తుంది. ఈ పోటు సలుపుగా గాని, నొప్పిగా గాని, పోటుగా గాని, నీరసము వలె గాని పొడచూపవచ్చును. నడిచేటపుడు కాలి కండరములకు రక్తప్రసరణ అవసరము పెరుగుతుంది. ధమనుల నాళ పరిమాణము తగ్గుటవలన అవసరములకు తగినంత రక్త ప్రసరణ, ప్రాణవాయువు సరఫరా లోపించి కండరములలో నొప్పి, పోటు, కలుగుతాయి. కాని సుమారు పది శాతపు మందిలోనే యీ పోటు ప్రామాణికముగా ఉంటుంది. నలభై శాతము మందిలో నొప్పిగాని, బాధగాని ఉండదు. కొందఱిలో నొప్పి కాలి పిక్కలలో కలుగక పోవచ్చును. కొందఱిలో నొప్పి నడక ఆపివేయునంత తీవ్రముగా ఉండకపోవచ్చును. కొందఱిలో నొప్పి పది నిముషముల విశ్రాంతితో ఉపశమించక పోవచ్చును. వ్యాధి తీవ్రత హెచ్చయినవారిలో నొప్పి విశ్రాంత సమయములలో

131 ::