పుట:Haravilasamu-Vavilla-1966.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

7

గర్ణాటదేశములోఁ జేరిన [1]కాల్పట్టణమునకుఁ బ్రభువుగా నున్నట్లు చెప్పియున్నందునను,

శ్రీనాథుని వీథినాటకములో -


శా. "కుళ్లా యుంచితిఁ గోక సుట్టితి మాహాకూర్పాసముం దొడ్గితిన్
     వెల్లుల్లిన్ దిలపిష్టమున్ బిసికితిన్ విశ్వస్త వడ్డింపఁగాఁ
     జల్లాయంబలి త్రావితిన్ రుచులు దోషం బంచుఁ బోనాడితిన్
     దల్లీ! కన్నడరాజ్యలక్ష్మీ! దయ లేదా నేను శ్రీనాథుఁడన్."


అను పద్యమునఁ "దల్లీ!" యని కర్ణాటదేశమును సంబోధించినందునను, ఈతని కవిత్వమునం బ్రాయికముగాఁ గన్నడపద పదములు గనఁబడుచున్నందునను,

శ్రీనాథుని జన్మస్థానము కర్ణాటదేశ మనుట సమంజస మనియు, నీతఁడు కర్ణాటదేశమున జన్మించినను శైశవముననే యీతని తల్లిదండ్రు లుద్యోగవశముననో మఱి యేకారణముననో కొండవీటిసీమకు వచ్చియుందు రనియు, నింటిలోఁ దలి దండ్రులతో మిశ్రకర్ణాటము మాట్లాడుచున్నను బాల్యమునుండి తెలుఁగుదేశములోఁ దెలుఁగువారితోఁ గలసి మెలసి యున్నందునఁ దెలుఁగువానివలెఁ దోఁచుచున్నాఁ డనియుఁ బల్నాటివీరచరిత్రపీఠికకారుల వాదము.

ఈ వాదమునకుఁ బ్రతికోటి ననుసరించి యాంధ్రుల చరిత్ర మూఁడవభాగములో - "కర్ణాటకటకపద్మవనహేళి" అను విశేషణము కర్ణాటదేశాధీశుని (దేవరాయల) నిండోల
  1. శ్రీనాథుఁడు కర్ణాటదేశస్థుఁడు కాఁడు. కాల్పట్టణము తూర్పు తీరమునందలి కాళీపట్టణ మని పెక్కండ్ర యాశయము.