పుట:Haravilasamu-Vavilla-1966.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4

పీఠిక

ర్షులుగూడ శ్రీరామాయణాదిదివ్యప్రబంధంబుల రచించి రేయియుం బవలు నా శబ్దసుధాప్రవాహమధ్యంబున మునుఁగుచుం దేలుచు నేల యుందురు? దివ్యప్రబంధ కవితామృత రసానుభవంబువలనఁ దాము నిత్యానందంబు నొందుటయెకాక, భావివిబుధులు పఠితలును శ్రోతలును విషయవైలక్షణ్యము నెఱింగి యుత్కృష్టపదవి నొందు మార్గము గనుఁగొందురుగాత మనియె మహర్షుల ముఖ్యోద్దేశము.

అట్టి మహానుభావు లగు ఋషిపుంగవుల గ్రంథములు కేవలము భావగర్భములును, బరోక్షమోక్షానందమును బొందించునవియు నగుటచేఁ బ్రతిమనుజునకుఁ దొలుదొలుత సామాన్యముగా వానియందుఁ బ్రవృత్తి గలుగుట దుర్లభము. కాఁబట్టియే ప్రాచీనులగు మహర్షుల సంప్రదాయము నెఱింగిన వారు గావున నర్వాచీను లగు కాళిదాసాదిమహాకవులు సయితము రామాయణాదికావ్యరత్నంబుల వెలుంగు దివ్యకవితా రసంబుం గ్రోలిక్రోలి మహానందంబు నొందుచుఁ దనివిసనక, యందఱు నిట్టి కావ్యానందంబు ననుభవింతురుగాత మని దయా పరవశు లై సులభముగ నా మహర్షికృతిరత్నంబుల రసానుభవంబుం జేయఁదగిన యోగ్యత నలవఱచు ననియు, నించుమించుగఁ బ్రాచీనర్షి కృతుల ననుకరించు రఘువంశశాకుంతలకాదం బర్యాదిప్రబంధంబుల లోకోపకారకంబులుగ రచించి, కవితారస మాధుర్యం బేకాంతంబున ననుభవించి, నిత్య తృప్తహృదయులై కీర్తిశేషు లైరి.

సంస్కృతభాషావిలాస మిట్లుండ సంస్కృతజన్యము లగు కర్ణాట ద్రావిడాదివైకృతదేశభాషలలోపల "దేశభాషలందుఁ