పుట:Haravilasamu-Vavilla-1966.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

శ్లో. ఇదమస్థం కృత్స్నం జాయేత భువనత్రయమ్,
     యది శబ్దాహ్వయం జ్యోతి రాసంసారం న దీప్యతే.


అజ్ఞానగాఢాంధతమఃపటలంబుఁ బటాపంచలు చేసి ముల్లోకంబుల విశుద్ధదివ్యజ్ఞానతేజుఃపుంజంబు వెలయించి సకలసదార్థ స్వరూపంబు నిరూపింప నసాధారణం బగు సాధనంబు శబ్ద జ్యోతి.

ఇయ్యది నిత్యమై దోషరహిత మై పరమానందకసై కాస్పదమై పరబ్రహ్మాత్మకం బనఁదగి యున్నది.

ఋగాదిచతుర్వేదంబులును, శిక్షాదిషడంగలబులును, మన్వాద్యష్టాదశస్మృతులును, శాతాతపాడ్యదళాగమములును, విష్ణ్వాద్యష్టాదశపురాణములును, నాయవ్యాద్యష్టాదశోప పురాణములును, భాట్టాది షడ్దర్శనంబులును, భారతాదీతిహాసంబులును, దక్కుంగల సకల శాస్త్రంబులు నీశబ్దబ్రహ్మము దివ్యావతారంబులు. ఈ శబ్దబ్రహ్మము నుపాసించియే మనపూర్వాచార్యు లగు వ్యాసపరాశరాది మహర్షిసత్తములు నిత్యానందరసై కాశ్రయం బగు మోక్షమార్గము నెఱింగి కృతకృత్యు లైరి.

ఇట్టి పరమోపకారకంబగు శబ్దం బిహపరసుఖానందకందంబని నొక్కి వక్కాణించుట సాహసంబు గాదు. కానిచో నివృత్తతర్షులై యరణ్యంబుల వాతాంబుపర్ణాశను లగు మహ