పుట:Haindava-Swarajyamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదునైదవ ప్రకరణము.


ఇటలీ భారత భూములు.


సంపా: మీరు ఇటలీ సాదృశ్యము తెచ్చియుండుట మంచిదే. మెజనీ చాల గొప్పనాడు. మిక్కిలి మంచినాడు. గారిబాల్డీ గొప్ప వీరుడు. ఇరువురుపూజ్యులు. నారి జీవితము లనేకవిషయముల మనకనుసరణీయములు, అయిన ఇటలీలో నుండిన స్థితికిని భారత భూమిస్థితికిని మిక్కి-లి తారతమ్యముకలవు. మొదట మెజినీ గారిబాల్డీలకు పరస్పరము కల భేదము నాలోచించుట ఆవశ్యకము. ఇటలీని గురించి మెజీని ఏయుద్దేశము పెట్టుకొనెనో అయుద్దేశము నేటికిని కొనసాగియుండలేదు. మానవధర్మములకు గురించి అతడు వ్రాసిన గ్రంథములో ప్రతిమానవుడు సామ్రాజ్యమును మొదట సంపాదింపవలయునని వ్రాసినాడు. ఇటలీలో ఇది యేర్పడలేదు. గారి బాల్డీ మెజీని పెట్టుకొనిన ఈ దృష్టిపథము పెట్టుకొనలేదు. గారిబాల్డీ ఆయుధము లిచ్చెను. ప్రతియిటాలియను వానిని ధరించెను. ఆస్ట్రియ యిటలీలు జ్ఞాతులైనందున వారి నాగరక మేకమయియే యుండినది. నాకు కన్ను పొడచిన వీరు కన్ను పొడచుటయే అవసరమై యుండనది. గారిబాల్డీ కోరినది ఆస్ట్రియా ప్రభుత్వమునుండి ఇటలీ వేరుపడ