పుట:Haindava-Swarajyamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇటలీ భారతభూములు.

85

వలయుననిమాత్రమే. మంత్రి కేవరు చేసినకుతంత్రములు ఇటలీకి సంబంధించిన ఆనాటిచరిత్రకు కళంకాపాదకములు. దాని వలన ఫల మేమియైనది. ఇటాలియనులు ఇటలీని పరిపాలించుటను జేసి ఇటలీప్రజ సుఖమందుచున్న దందు రేని మీరంధకారమున బడి చూడలేకున్నారు గాని మరేమియును గాదు. మెజీని ఇటలీ స్వతంత్రము కాలేదని స్పష్టముగా చూపినాడు. ఆపదమునకు విక్టరు ఇమాన్యుల్ ఒకయర్థము చెప్పి నాడు. మెజీనీ మరియొక యర్థమును చెప్పినాడు. ఇమాన్యుల్ , క్రేవర్ - గారిబాల్డీతో సహా ఇటలీయనిన ఇటలీరాజును అతని సహకారులు ననిమాత్ర మాలోచించిరి. మెజీని ఇటలీ యన తద్దేశప్రజ, రైతాంగమంతయు నని యాలోచించెను. ఇమాన్యుల్, నిజముగా ఆ ఇటలీకి సేవకుడు. మెజీని మానసముననుండిన ఇటలీ ఇంకను దాస్యమును బాయలేదు. జాతీయంతటికిని సంబంధించినయుద్ధము పొసగినప్పుడు ఇరువురురాజుల లాభాలాభములుమాత్రమే యాలోచింప బడెను. ప్రజను చదరంగములోని కాయలవలె ఈ రాజు లుపయోగించుకొనిరి. ఇటలీలో పనివార లీనాటికిగూడ అసౌఖ్యమునబడి కొట్టుకొను చున్నారు. కాబట్టి వారు హత్యలు కావించుట, తిరుగుబాటులు చేయుట జరుగుచున్నది. ఎప్పుడును వారు విప్లవముకలిగింతురను భయము కలదు. ఆస్ట్రియాసైన్యములు ఇటలీ వెడలిపోయిన