పుట:Haindava-Swarajyamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
66

హైందవ స్వరాజ్యము.


సిద్ధము చేయుదురు, ఏమిరుసుములు తీసికొనవ లెనో వారే నిశ్చ యింతురు. పదో మహోపకారము చేసినట్లు నటించి బీద లోహోయను నట్లో నర్తురు.


సాధారణ కార్మికులకంటే వారి కేల యెక్కువ రుసుము చెందవలెను? వారి యవసరము లేల అంతకంటెను నెక్కువ! సామాన్య కార్మికులకంటె వీ రెట్లు దేశమున కెక్కు వయుప 'మోగకారులు.. ఎక్కువ మేలుచేయువారి కెక్కున ద్రవ్యము చేరవలేనా? ద్రవ్యముకొరకు వారు 'దేశమునకు 'మేలుచేయు నెడల దాని నెట్లు మేలుగా గణింపవచ్చును? హిందూ మహమ్మదీయ వివాదములను గురించి కొంచె మైనను ఎరింగిన వారు అవి సలుమరు వకీళ్ల మూలకముగా జనిం చిన వనుటను గుర్తింపగలరు. కుటుంబములు వారివలన నశిం చినవి. వారు సోదరులను శత్రువుల నొనర్చినారు. సంస్థాన ములు వకీళ్ల అధీనమున జిక్కి అప్పులకుప్పలైనవి. కొందరు సర్వస్వమును ధారపోసికొనినారు. ఇట్టి సంగతు లూరక పెంచి చెప్పవచ్చును.


వకీళ్లు దేశమునకు చేసిన అపచారములలో నెల్ల పెద్దది ఇంగ్లీషు వారిపట్టును బలవ త్తమ మొనర్చుటయే. న్యాయస్థానములు లేకపోయినయెడల ఇంగ్లీషువారి రాజ్య పరిపాలన సాధ్యమగునా? ప్రజల మేలునకయి న్యాయస్థానము లేర్పడినవని యాలో