పుట:Haindava-Swarajyamu.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

65

భారతభూమిస్థితి.

పొం డనును. ఇరుపక్షముల లోపము లేక పోట్లాట రాదనును. మరి పోట్లాడవలదని బుద్ధి చెప్పును. వారు వకీళ్ల వద్దకు పోదురు. వకీళ్లు తామంగీకరించు పక్షము వారితో నొక్కటయిపోయి వా. రిని న్యాయమనిపించుటకు సాధనము లాలోచింపవలసియుం దురు. అసలు పక్షమువారికి ఈ సాధనములు తోచను గూడ తో చవు. కాని ఈ ధర్మము నెరవేర్చని యెడల వకీలు తననృత్తికి కళం కము తెచ్చినవాడగును, కాబట్టి సర్వసామాన్యముగా వకీళ్ళు కలహములను త్రుంచుటకు బదులు పెంచువా రగుచున్నారు. ఇంతేకాదు. ఆవృత్తిలో చేరువారు ఎక్కువగా ఇతరులకు సహా యముచేయవలెనని చేరువారు కారు. తాము కుబేరులైన చాలు నని వారియు ద్దేశము. వకీలువృత్తి ఐశ్వర్యమార్గములలో నొక్క- టి కాబట్టి వకీళ్లకు కలహములు పెంచుట మీదనే దృష్టి. మను ష్యులు తమలో తాము వివాదపడిన చోట వకీలుకు సంతోష మనుట నే నెరిగిన సంగతి. చిన్న పకీళ్లు కృత్రిమ కలహములను సృష్టించుట కూడ కలదు. మధ్యవర్తులా బీదల ర క్తమును పీల్చి పిప్పి చేయుదురు. వకీళ్లకు నిజముగా పని లేదు. సౌఖ్యలోలు రగు నుద్దేశముతో సోమరిపోతులి వృత్తి నవలంబింతురు. ఇది నిజము. మరి యేవాద మైనను చెప్పుదు రేని అది వట్టి బూట కము. వకీలువృత్తి గౌర పపాత్రమని కని పెట్టినవారువకీళ్లే తమ గౌరవ పాత్రతను సిద్ధము చేసినట్టులే వారు శాసనములను గూడ