పుట:Haindava-Swarajyamu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

55

భారత భూమిస్థితి,

మతము వీడుదురనుటను మరచిపోయిరి. , రెండు పక్షములును ఐక్యము మై జీవింప నిశ్చయించుకొనిరి. ఇంగ్లీషు వారి రాకతో మరల నాపోరాటములు ప్రారంభమయ్యెను.


ఇరువాగులవారును పోరాడుకొనునప్పుడు మీ చెప్పిన లో కోక్తు లేర్పడినవి. ఇప్పుడు వానిని తడవుట నష్టదాయకము. హిందూమహమ్మదీయు లనేకులు నేటి దినము ఏకమూలపురు షుని పేర్కొనుట లేదా ! వారిరక్త ము వీరియందు వీరిరక్తము వారియందు ప్రవహించుచున్న దిగదా ! మతము మార్చినం తనే మానవులు విరోధు లగుదురా! హిందువుల దైవము మహమ్మదీయుల దైవమున కంటే భిన్నమా ! మతములొ కే గమ్యస్థానమునకు జేర్చుమార్గములు కావా ! గమ్యస్థాన మొ క్కటే యైనప్పుడు మన మేమార్గము ననుసరించిన నేమి ? పో ట్లాడుకొనుటకు కారణ మేమికలదు ?


అంతియే కాదు. శైవులకును నైష్ణవులకును సంబంధించిన లోకోక్తు లెంతటి బలవద్విరోధమునో సూచించునట్టివి యున్నవి. అయిన వీ రేక జాతివారు కారని యెవ్వరును అనుట లేదు. వేదా ధారమతము 'జై నమతము కాదు. అయిన నీ రెండుమతముల వారును భిన్న జాతులు కారు. నిజమిది.మనము దాసులమైనాము. అందుచేత ఒండొరులతో పోరాడుకొని మనపోరాటమును మూడవవాని మూలకముగా తీర్చుకొన నిచ్చగించు చున్నాము.