పుట:Haindava-Swarajyamu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
54

హైందవ స్వరాజ్యము.


కాజాలరు. హిందువులు భారత భూమిని తామేనివసింప నెంతు రేని మిథ్యలో పడిన వారగుదురు. భారతభూమిని మాతృ భూమిగా కొనియుండు హిందూ, మహమ్మదీయ, క్రైస్తవ, పారసీలందరును ఏక దేశీయులు. తమతమ స్వలాభమున కే యైనను వీర లొండొరులతో సైకమత్యముగా నివసింప వలసి యుందురు.లోకములో ఎచ్చటను జాతీయత యనిన ఏకమతా వలంబనమను నర్థము లేదు. భారత భూమిలోను ఆసిద్ధాంతము నడచినది కాదు.


చదువరి: అయిన హిందూమహమ్మదీయులకు గల సహజ వైరమునుగురించి మీ రేమందురు.


సంపా:మనయిరువురకు శత్రువులైనవారపదములనుకల్పిం చినారు. హిందువులు మహమ్మదీయులు పోరాడికొనినప్పుడు అట్లువర్ణించిరి సరిగదా బహుకాలముగా పోరాటములు లేవే ఇక సహజ వైర మెక్కడకలదు. మరియొక విషయము జ్ఞాపక ముంచుకొనుడు. హిందూ మహ్మదీయులు పోరాటములు మానుకొనుట బ్రిటిషువారి రాజ్యస్థాపనకు తరువాతనే యని యనుకొనరాదు. హిందువులు మహమ్మదీయ పరిపాలనలోను మహమ్మదీయులు హిందూ పరిపాలనలోను చక్కగా వర్ధిలిరి. ఇరుప్రక్కలవారును పరస్పరము పోరాడు కొనుట ఆత్మహత్యకు మార్గ మని యెరింగికొనిరి, కత్తికట్టిన మాత్రాన ఒండొరుల