పుట:Haindava-Swarajyamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

45

భారతభూమిస్థితి: రైళ్లు

యనున వీ స తేజమును రైళ్లేకదా వ్యాపింపఁ జేసినవి. అదొక్క మేలు చాలదా?. అన్ని నష్టములను కప్పుటకు.

సంపా: ఇది తప్పని నాయభిప్రాయము.మనము ముందొక జాతిగా నుండ లేదని, మన మొక్క జాతి యగుటకు యుగములు పట్టునని ఇంగ్లీషు వారుమనకు నేర్పినారు. దీని కేమియు ఆధారము లేదు. ఇంగ్లీషువారు. భారతభూమికి రాకముందు మన మొక్క జాతిగా నే ఉండినాము. మనభావప్రపంచమంతయు నొకటే. మనజీవితమార్గమంతయు నేక మే. మనమందరు ఒక్క జాతిగా నుండినందుననే వారు రాజ్యమును నిర్మింపగలిగిరి. తరువాత నే వారు మనలను విభాగించినది.

చదు వరి: ఇది వివరించి చెప్పవ లెను.

నంజ : మనము ఒక జూతిగా నున్నందువలన మనలో విభేద ములే ఉండలేదని నేను చెప్పరాలేదు. చెప్పదలఁచిన దిది. మననాయకులు భారతభూమియంతటను బండ్ల మీదనో నడచి యో సంచారము చేయుచుండువారు. ఒండొరులభాష నేచ్చు కొనువారు. ప్రత్యేకత్వము పాటించువారుగారు. దక్షిణమున సేతుబంధరామేశ్వరము ఈశాన్యమున జగన్నాథము. ఉత్తరము న హరిద్వారము పుణ్య క్షేత్రములుగా నియమించిన మన పూర్వి కులయు దేశ మేమయి యుండునో చెప్పగలరా ? వారు వెర్రి వారుకారుకదా ! క్షేత్రములలోవలె దేవ తారాధన ఇంటిలోనే