పుట:Haindava-Swarajyamu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
50

హైందవ స్వరాజ్యము.


చేసుకొనవచ్చునని వారెరుగుదురు. భక్తిప్రపూర్ణములైన హృదయములే గంగా ప్రవాహములని వారు మన కుబోధచేయ నే చేసిరి. కాని వారు భారతభూమి దైవనిర్మితమైన ఏకప్రదేశ మనుటను గురుతించిరి. అందుచేత అది ఏకజాతిగా నుండవలసిన దని తీర్మానించిరి. తదనుగుణముగా భారతభూమి పది చెరగు లను పవిత్రక్షేత్రములను స్థాపించి మరిభూలోకమున నెచ్చటను ప్రయత్నింపని భావోద్రేక పద్దతిని అనుసరించి భారత జాతీయతను స్థిరపరచిరి. ఇరువుగాంగ్లేయులు తా మొక్కటియనుకొ నుటకంటె ఇరువురు భారత పుత్రులు తామొక్కటియనుకొను టలో గాఢతరసంవేదనకలదు. మీరు, నేను నాగరికులమను కొనుమనము. ఏదో ఆకసమునుండి ఉట్టిపడిన గౌరవపదస్థు లమనుకొనుమనము వేరు వేరు జాతులకు చేరిన వారమనుకొను చున్నాము. రైళ్లు వచ్చిన తరువాత నే మనము విభేదములమాట మాట్లాడుకొన నారంభించినది. రైళమూలకముగానే ఈవిభే దములను పోగొట్టుచున్నా మందు రేని మీరట్లే యనుకొన వచ్చును. నల్ల మందు తినువాడు నల్ల మందు తినుటకు నేర్చిన పిదప తనకు చెరుపు తెలిసినది కాబట్టి తానునల్లమందు అభ్యాసము చేయుట మంచి దేయనుకొని నట్లుండును. నేను రైళ్లను గురించి చెప్పిన దంతయు మీరు జాగరూకులై ఆలోచింతురు గాక.


చదువరి: సంతసముతో నాలోచింతును. కాని నాకొక ప్ర శ్న పొడకట్టుచున్నది. మీరు చెప్పినదంతయు మహమ్మదీయు.