పుట:Haindava-Swarajyamu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము.


భారతభూమి స్థితి.


చదువరి : ఆంగ్లేయు లేల హైందవ భూమిలో నిలచియున్నా రో యిప్పుడు నాకర్థమయినది. మన దేశ స్థితిని గురించి మీ యభిప్రాయము లేమియో నేను వినవలతును.


సంపా: అస్థితి మిగుల విచారకరమైనది. దానిని గురించి ఆలోచించిననే నాకంట నీరు నిండుచున్నది. గొంతు ఎండ బారి పోవుచున్నది. నిజముగా నాహృదయమున కలరూపు కలయ టులు వివరింపగలనా యను సందేహము పుట్టు చున్నది. ఇంగ్లీషు వారి కాలి క్రింద కాదు మనము పడిమడయుచుండుట. గరికముయొక్క తొక్కుడున మనము నశించుచున్నామనుట నా పూర్ణ విశ్వాసము. ఆ రాక్షసుని భరింపలేక దేశమాత సంకటపడి మూల్గుచున్నది. తప్పించుకొనుట కికను అవ కాశ మున్నది. కాని దినములు గడచిన ట్లెల్ల నాయావకాశము తగ్గిపో పుచున్నది. మతమునందు నాకభిమానము. నాకు మొదట కాన్పించు గొప్పులోపము భారతభూమి దుర్మతము పాలగుచుండు టయే. నేనుహిందూ, ముహమ్మదీ పారసీ మతములను గురించి ఆలోచించుచున్నా ననుకొసవలదు. అన్ని మతము లకు మూలాధారమైన ఆధ్యాత్మిక మతముసంగతియే నాయ లోచన. మనము దైవమునే దూరము చేసికొనుచున్నాము