పుట:Haindava-Swarajyamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
42

హైందవ స్వరాజ్యము.


చదువరి: ఆదియెట్లు?

సంపా : మనముసోమరిపోతుల మని యురోపియనులు కష్టిం చువారిని సాహసులని ఒక్క ప్రతీతి యేర్పడినది. అప్రతీతిని మన మంగీకరించి మని స్థితిని మార్చుకొననిచ్చగించుచున్నాము. హిం దూ మహమ్మదీయ పారసీ క్రైస్తవమతములు బోధచేయున దేమన, భౌతిక సౌఖ్యముల యెడల లోలత్వమువలదు. ఆధ్యాత్మిక లోకమునకై సతత పరిశ్రమచేయవలసినది. లోకములో విషయ సంగ్రహమొనర్చుదు సనునాశను త్రుంచవలసినది. ముక్తి మార్గమును తదేక దీక్షతో సరయవలసినది. మనసర్వ ప్రయ త్నముదీనికి వినియోగించవలసినది.


చదువరి: మీ రేమి! మతముపిచ్చి పట్టించు ప్రయత్నము చేయు నట్లున్నారు. ఎందరో దొంగలు ఇ దే రీతిని బోధించి లోకులను "పెడమార్గముల బట్టించినారు.


సంపా: మతమును గురించి మీరక్రమదూషణ చేయుచున్నా రు' సుమా! దొంగతనము మతము పేరిట జరుగకపోలేదు. వెలుతు రెక్కడక లదో చీకటియు నుండకపోదు. ఆధిభౌతిక విషయములలోని దొంగలకంటే ఆధ్యాత్మిక విషయములలోని దొంగలు ఎక్కువ దుర్మార్గులు కారని నేను ఋజువు చేయ గలను. నాగరకము పేరట జరుగునట్టి దుర్మార్గము మతము పేరట నెప్పుడును జరుగదనుట ఇదె మీరు కనగలరు.